ఆ తెలంగాణ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆమెను రేప్ చేశాడట!?

Update: 2022-05-10 10:30 GMT
తీవ్ర నేరారోపణను ఎదుర్కొంటున్నారు తెలంగాణ రాష్ట్రంలోని నారాయణ పేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి. పార్టీకి చెందిన మహిళా నేతపై ఆయన పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లుగా బాధితురాలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

శివకుమార్ మీద సదరు మహిళా నేత చేసిన ఆరోపణలు.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల్లోకి వెళితే..
2020 మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మహిళా నేతకు నారాయణపేట జిల్లాను కేటాయించారు. ఆ సమయంలో సదరు మహిళా నేతకు ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డితో పరిచయమైంది. తన భార్య ఆరోగ్యం బాగోదని.. మూడేళ్లకు మించి బతకదని.. తనకో తోడు కావాలని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.

దుబ్బాక ఎన్నికల సమయంలో ఒక రోజు రాత్రి శివకుమార్ రెడ్డి తప్ప తాగి బాధితురాలి గదికి వెళ్లాడు. తన కోరిక తీర్చాలని బలవంతం చేశాడని.. పెళ్లి కానిదే అలా చేయలేనని సున్నితంగా తిరస్కరించినా అతను తనపై దాడి చేశాడని చెప్పారు. తాను ఎదురు తిరగటంతో వెళ్లిపోయిన అతడు 2021 జూన్ 24న ఒక హోటల్ కు తీసుకెళ్లి బలవంతం చేయగా ఒప్పుకోలేదన్నారు.

దీంతో మెడలో పసుపు తాడు కట్టి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగిందని చెప్పి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారన్నారు. తర్వాత బెంగళూరులో పని ఉందని చెప్పి తీసుకెళ్లి..అక్కడా అత్యాచారం చేశారన్నారు.

ఈ మధ్యన బేగంపేటలోని ఒక హోటల్ కు పిలిపించి.. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి తాగించాడని.. తెలీక తాగిన తర్వాత తన సెల్ ఫోన్ లో నగ్న చిత్రాలను షూట్ చేసి.. తాను పిలిచినప్పుడల్లా వచ్చి తన కోరికల్ని తీర్చాలని వేధిస్తున్నట్లు పేరకొన్నారు. తనను బ్లాక్ మొయిల్ చేస్తూ అతని అనుచరుల చేత అవమానించేలా కుట్రలు పన్నినట్లుగా వాపోయారు. దీంతో.. సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News