హుస్సేన్ సాగర్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం

Update: 2020-09-16 17:32 GMT
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి తెలంగాణ సర్కార్ జీవో విడుదల చేసింది. హుస్సేన్ సాగర్ సమీపంలో 11 ఎకరాల స్థలంలో 125 అడుగుల విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇందుకోసం 140 కోట్లను ఖర్చు చేయనున్నారు.

బాబా సాహెచ్ 125వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ విగ్రహ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సర్కార్ అడుగులు వేస్తోంది. సువిశాలమై అంబేద్కర్ పార్కును నిర్మించబోతోంది.

ఇక్కడ అంబేద్కర్ విగ్రహంతోపాటు మ్యూజియం, లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తారు. విగ్రహం పొడవు 45.5 ఫీట్లు ఉంటుందని మంత్రులు ఈటెల, కొప్పుల వెల్లడించారు. ఈ మేరకు విగ్రహ నమూనాను విడుదల చేశారు.

అంబేద్కర్ విగ్రహానికి భారీగా స్టీల్ , ఇత్తడి వాడుతున్నారు. స్టీల్ 791 టన్నులు, ఇత్తడి 96 మెట్రిక్ టన్నులుగా తెలిపారు.
Tags:    

Similar News