ప్రపంచానికి పట్టిన కరోనా భయాన్ని మరోస్థాయికి తీసుకెళ్లిన ఘనత మాత్రం ఒమిక్రాన్ దే. ఇప్పటివరకు బయటపడిన వేరియంట్లలో అత్యంత ముదురు వేరియంట్ గా దీన్ని చెబుతున్నారు. మిగిలిన వాటి కంటే వేగంగా విస్తరించటం దీనికున్న దుర్మార్గమైన గుణమైతే.. మరణాల రేటు అత్యంత తక్కువగా ఉండటం దీనికున్న మంచి లక్షణంగా చెప్పొచ్చు కాకుంటే.. ఒమిక్రాన్ బారిన పడిన వారు తీవ్రమైన ఆలసట.. ఒళ్లు నొప్పులతో సతమతమవుతారని.. సరైన సమయంలో సరైన రీతిలో మందులు వాడితే సరిపోతుందని చెబుతున్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వాళ్లను సైతం వదిలిపెట్టకుండా వేధించే ఒమిక్రాన్ వేరియంట్ తాట తీసే విషయాన్ని తాజాగా ప్రకటించింది ఆష్ట్రాజెనెకా.
తాజాగా ఈ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఒమిక్రాన్ ను కట్టడి చేయటంతో తమ టీకా మూడో డోసు కీలకంగా వ్యవహరిస్తుందన్న విషయాన్ని వెల్లడించారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను యూరోప్ లో వాక్స్ జెవ్రియా గా వ్యవహరిస్తారు. ఈ టీకా మూడో డోసు వేసుకున్న వారు.. ఒమిక్రాన్ వేరియంట్ ను దరి చేరకుండా చేసుకోగలిగినట్లుగా తాజా అధ్యయనం పేర్కొన్నట్లుగా ఆక్స్ ఫర్డ్ పరిశోధకులు పేర్కొన్నారు. కోవిడ్ సోకి.. సహజంగా కోలుకున్న వారితో పోలిస్తే.. ఆస్ట్రాజెనెకా బూస్టర్ డోసు తీసుకున్న వారిలో ఒమిక్రాన్ ను కట్టడి చేసే యాంటీ బాడీల స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. రెండు డోసులు ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత డెల్టా వేరియంట్ ను నిరోధించే యాంటీబాడీల స్థాయి ఎంతలా ఉంటాయో.. మూడో డోసు వేసుకున్న తర్వాత ఒమిక్రాన్ ను నిరోధించే యాంటీబాడీలు అదే స్థాయిలో ఉన్నట్లుగాపేర్కొన్నారు. తాము చేసిన అధ్యయనాన్ని టీకా తయారీదారులతో సంబంధం లేకుండా స్వతంత్య్రంగా చేసినట్లుగా వారు చెబుతున్నారు. మొత్తంగా ఆస్ట్రాజెనెకా టీకా మూడో డోసు వేసుకుంటే.. ఒమిక్రాన్ వేగాన్ని బ్రేకులు వేయటమే కాదు.. దరి రాకుండా చేసుకోవచ్చని చెప్పక తప్పదు. చూస్తుంటే.. ఈ నివేదిక వైరల్ అయ్యే కొద్దీ ఆస్ట్రాజెనెకా టీకా డిమాండ్ అంతకంతకూ భారీగా పెరిగిపోవటం ఖాయం.