సెక్స్ ట్రాప్: వాళ్ల దరిద్రం దూరమైంది

Update: 2021-07-02 15:30 GMT
ఐదేళ్ల క్రితం వారు అది అత్యంత వెనుకబడిన కరువు గ్రామం. రాజస్థాన్ లోని మేవాట్ ప్రాంతంలోని చుల్హేరా గ్రామం అష్ట దరిద్రాలతో అష్టకష్టాలు పడింది. నిరక్షరాస్యత, పేదరికం, మౌలిక వసతుల లేమితో కునారిల్లుతుండేది. కానీ ఐదేళ్లు.. సెక్స్ ట్రాప్ లేదా హానీ ట్రాప్ చేశారు. దీంతో ఈ ఊరి దరిద్రం దూరమైంది. ఊరు మొత్తం లగ్జరీ గ్రామంగా మారింది. పూరి గుడిసెల స్థానంలో బిల్డింగులు, ఖరీదైన కార్లు, అందమైన రోడ్లు వచ్చాయి. ఐదేళ్లలోనే ఆ ఊరు అభివృద్ధి పథంలో దూసుకుపోయింది. దీనికంతటికి కారణం.. ధనవంతులు, ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేసి ఆ వూరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి సాగించిన ‘సెక్స్ ట్రాప్ ’యే కారణం.

గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ఫ్టాట్ ఫామ్స్ లో నకిలీ ఖాతాలు తెరుస్తారు.  అందమైన అమ్మాయిల ఫొటోలను ప్రొఫైల్ పిక్చర్ లుగా పెడుతారు. ధనవంతులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్స్ కు ఈ నకిలీ ఖాతాల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపి వారితో సెక్స్ చాట్ చేస్తారు. ముగ్గులోకి దింపి వాట్సాప్ వీడియో కాల్ చేసి పోర్న్ వీడియోలు చూపించి వారిని అలా చేసేలా చేసి ఆ వీడియోలు రికార్డ్ చేసి సెక్స్ చాట్ కు సంబంధించిన ఫైల్స్ సదురు వాట్సాప్ నంబర్ కు పంపుతారు.

ఇక వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తారు. బెదిరిస్తారు. డబ్బులు ఇవ్వకపోతే సోసల్ మీడియాలో పెడుతామని హెచ్చరిస్తారు. పరువు పోతుందని చాలా మంది భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఇలా డబ్బులు ఇస్తారు. మళ్లీ అడిగినా ఇస్తూనే ఉంటారు.

ఈ సెక్స్ టార్షన్ గురించి ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగుచూసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని మేవట్ ప్రాంత పరిధిలోని గ్రామాలకు చెందిన వారే ఓ ముఠాగా ఏర్పడి ఇలా లక్షలు వసూలు చేసి ఆ గ్రామంలో దర్జాగా బతికారని.. పూరి గుడిసెల్లో ఉండేవారు ఇప్పుడు బంగ్లాలు, కార్లలో తిరుగుతున్నారని తేలింది.

అయితే చేసే వారు ఎవరో.. వెనుక చేయించేవారు వేరే ఉంటారు. వారు కనిపించరు. కేవలం కాల్స్ ద్వారా మాత్రమే వీరిని చేయిస్తారు. ఇలా ఇది పెద్ద దందా అని తేలింది. గ్రామంలోని నిరుద్యోగ యువతి యువకులను ఇలా సెక్స్ ట్రాప్ లో వాడుకుంటున్నారు. ఇక అరెస్ట్ అయినా కూడా వారిని బెయిల్ మీద బయటకు తీసుకొస్తోంది ఈ ముఠా. ఇలా పెద్ద తతంగమే నడిపిస్తున్నారు. పోలీసుల విచారణలో ఈ గ్రామం పేదరికం పూర్తిగా మారిపోయిందని.. అదంతా సెక్స్ ట్రాప్ తో సంపాదించిన సొమ్ములేనని తేలింది. వారి జల్సాలు చూసి పోలీసులకే నోట మాట రాలేదంటే నమ్మండి..
Tags:    

Similar News