బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వాలని ఫోన్ చేసి ఆ పార్టీ నేతలను అడిగితే చిటికలో విషయం చెప్పేస్తారు. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ గడుసుగా పార్టీ ఆవిర్భావ సభలో ఆ విషయం ప్రస్థావించారు. దానికి అంతే తెలివిగా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ఒక మీడియా సమావేశాన రియాక్ట్ అయ్యారు.
ఇంతకీ పవన్ ఏం అడిగారు సోము ఏం చెప్పారు అన్నది కనుక చూస్తే చాలా విశేషాలే కనిపిస్తాయి. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తామని అంటోంది. అదేంటో చైబితే ఏపీలో వైసీపీని దించే పని తొందరగా మొదలుపెడతామని పవన్ అన్నారు. అంతే కాదు ఏపీలో ఏ ఒక్క వైసీపీ వ్యతిరేక ఓటూ చీల్చకుండా చూస్తామని కూడా స్పష్టం చేశారు.
దానికి సోము ఎలా బదులిచ్చారు అంటే రోడ్ మ్యాప్ అన్నది ఎపుడో మా పార్టీ పెద్దలు ఇచ్చేశారు అని చెప్పి షాక్ తినిపించారు. రెండు నెలల క్రితం తిరుపతికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చారు. ఆయన బీజేపీ నేతలతో మీటింగ్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఏపీలో ఎట్టి పరిస్థితిల్లో అధికారంలోకి రావాలని సూచించారు. మిత్రపక్షం జనసేనను కూడా కలుపుకుని పార్టీ ప్రోగ్రామ్స్ గట్టిగా చేపట్టాలని కూడా కోరారు.
అయితే బీజేపీ నేతలకు చెప్పిన రోడ్ మ్యాప్ భోగట్టాను మిత్రుడు పవన్ కి రెండు నెలలు గడచినా చెప్పలేదా అన్నది ఒక డౌట్ అయితే పవన్ వంటి చరిష్మాటిక్ లీడర్ ని ఉంచుకుని కేవలం తమ వారి చెవులో జనసేనతో కలసిపోండి అని చెప్పడం అంటే అది చిత్రంగానే ఉంది. రెండు పార్టీలు కలసి పనిచేయాలీ అంటే రెండు పార్టీలకూ రోడ్ మ్యాప్ మ్యాటర్ చెప్పాలి.
ఇలా బీజేపీ మీటింగులో రోడ్ మ్యాప్ ఇచ్చేసి జనసేనతో ముందుకు వెళ్ళండి అంటే ఎలా కుదురుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూసి మరీ ఏకంగా సభలోనే అడిగేశారు. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టం. రెండు పార్టీల మధ్య బిగ్ గ్యాప్ ఉంది. దాంతో పాటు ఎవరికి వారు సెపరేటుగానే కార్యక్రమాలు చేపడుతున్నారు.
గత నెల నర్సాపురంలో పవన్ కళ్యాణ్ మత్యకార సభను నిర్వహించారు. అపుడు కూడా బీజేపీ ఊసు లేదు. ఇక ఆవిర్భావ సభలో ఏపీలో తానే పెద్దన్న అని పవన్ సోలోగా చాటుకున్నారు. చివర్లో ఒక్క మాట మాత్రమే బీజేపీ గురించి చెప్పారు.
ఇక బీజేపీ తీరు ఎలా ఉంది అంటే జనసేనతోనే కలసి వెళ్లాలని చెబుతూనే తమ మటుకు తాముగా ప్రొగ్రామ్స్ చేసుకుని వెళ్తున్నారు. ఏపీలో టీడీపీ తో పొత్తు వద్దు అన్నది బీజేపీ ఫిలాసఫీ. మరి పవన్ అయితే అన్ని పార్టీలతో కలసి వెళ్లాలి అంటూ టీడీపీతో పొత్తును చెప్పకుండానే చెప్పేశారు. ఈ నేపధ్యంలో విశాఖలో మీడియా ముందు సోము వీర్రాజు తమ రెండు పార్టీల పొత్తు మీద గట్టిగా ఒక మాట చెప్పడానికి ఆపసోపాలే పడ్డారు.
మా మధ్య పొత్తు ఉంది. 2024లో వచ్చేది మేమే. ఏపీలో బీజేపీ జనసేన అధికారంలోకి రావాలన్నదే అమిత్ షా ఇచ్చిన రోడ్ మ్యాప్ అని కూడా చెప్పారు. అంటే దాంట్లో టీడీపీకి చోటు లేదు. అందుకే పవన్ కళ్యాణ్ సభలో అన్ని పార్టీలు కలవాలి అని బిగ్ సౌండ్ ఇచ్చినది. సో సీన్ చూస్తూంటే రోడ్ మ్యాప్ మ్యాటరే కూటమి కధను తేల్చబోతుందా అన్నదే డౌట్ గా ఉంది.