ప్రపంచం ఏమైతేనేం.. మాకు మా వ్యాక్సినే: ట్రంప్

Update: 2020-09-02 14:00 GMT
వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీ విషయంలో తాము ఎవరితోనూ కలిసి పనిచేయమని.. తమను తాము నిర్బంధించుకోదలుచుకోలేదని అమెరికా తెలిపింది. వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీ విషయంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూ.హెచ్.వో) ఆధ్వర్యంలో 170 దేశాలు కోవాక్స్ పేరిట ఓ కూటమిగా ఏర్పడ్డాయి. అందులో తాము కలవబోమని అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది.

ఏ వ్యాక్సిన్ అయితే కరోనాపై సమర్థంగా పనిచేస్తుందో వీలైనంతగా అందరికీ పంచాలన్నది అందరి ఆలోచన. ఈ ఒప్పందం వల్ల ప్రయోజనం లభిస్తుందని డబ్ల్యూ.హెచ్.వో పేర్కొంది.

అయితే అవినీతిపరులైన ప్రపంచ ఆరోగ్యసంస్థ, చైనాతో ప్రభావితమైన బహుళపక్షాల సంస్థల ఉచ్చులోకి వెళ్లబోం అని వైట్ హౌస్ అధికారప్రతినిధి డీర్ తెలిపారు.

ప్రస్తుతం అమెరికాలో వ్యాక్సిన్, అభివృద్ధి, క్లినికల్ ట్రయల్స్ శరవేగంగా సాగుతున్నాయి. వ్యాక్సిన్ ను ప్రపంచదేశాలతో పంచుకునే విషయంలో మాత్రం ట్రంప్ కలవకపోవడం స్వదేశంలోనే విమర్శలకు కారణమవుతోంది.
Tags:    

Similar News