నార్వే దేశంలో ఇటీవల ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న 23 మంది వృద్ధులు మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో ఫైజర్ వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొన్నది. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఫైజర్ వ్యాక్సిన్ 10 మిలియన్ల డోసులకు ఆర్డర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వంలో ఆందోళన నెలకొన్నది. ఈ టీకాపై చర్చించేందుకు నార్వే వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో చర్చించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ విషయంపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రిత్వ శాఖ నార్వే ప్రభుత్వంతో సంప్రదింపులు మొదలుపెట్టిందని నార్వే వైద్య అధికారులు తెలిపారు.
నార్వేలో జరిగిన ఘటనపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆరోగ్యం ఉన్నవాళ్లకు, యువకులకు ఈ వ్యాక్సిన్ ఇవ్వవచ్చని నార్వే వైద్యాధికారులు అంటున్నారు. వృద్ధులు, తీవ్ర ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్నవాళ్లకు ఈ టీకా వేయొద్దని అంటున్నారు.
యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ కొత్త అధ్యక్షుడు ఎమెర్ కుక్ స్పందిస్తూ.. కోవిడ్ నివారణకు టీకా వేసే సమయంలో భద్రత ఎంతముఖ్యమో తెలియజేస్తుందని అన్నారు.
ముఖ్యంగా ఆర్‌ఎన్‌ఎ వంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం ఒక ఛాలెంజ్ అని చెప్పారు.నార్వే దేశంలో రెండు రోజుల క్రితం కరోనా టీకాలు వేయించుకున్న కొద్దిసేపటికే 23 మంది వృద్ధులు మరణించారు. కరోనా టీకాలు వేయించుకున్న 23 మంది అనారోగ్యానికి గురై మరణించడంతో నార్వే అధికారులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. అయితే వృద్ధులకు ఈ వ్యాక్సిన్ పంపిణీ చేయడం సరికాదని అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే 23 మంది చనిపోయారు.
వారిలో 13 మందికి విరేచనాలు, వికారం, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయి.
అయితే ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు ఎంతో ప్రభావంతంగా పనిచేస్తున్నాయని.. వైద్య నిపుణులు ఇదివరకు అనేకసార్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా 23 మంది వృద్ధులు చనిపోడంతో ఫైజర్ వ్యాక్సిన్‌పై అనుమానాలు నెలకొన్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ డోసులకు పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇచ్చిన దేశాల్లో ఆందోళన నెలకొన్నది.