దేశ విదేశాల్లో తాజాగా నిర్వహించిన అధ్యయనాల ప్రకారం కరోనా వైరస్ 8వ రోజుకల్లా శక్తిహీనం అవుతోందని వెల్లడైందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా తెలిపారు. ఎనిమిదో రోజు నుంచి సంక్రమణ శక్తిని కోల్పోతుందని పేర్కొన్నారు.
వైరస్ సోకిన వ్యక్తుల్లో కనిపించే లక్షణాలను జాగ్రత్తగా గమనించాలని రణ్ దీప్ తెలిపారు. తేలికపాటి లక్షణాలున్న వారు.. అసలు లక్షణాలే కనిపించని వారు హోం క్వారంటైన్ లో ఉండాలని పేర్కొన్నారు.
ఇంట్లో ఉన్న వారికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తినా.. ఎదలోనొప్పి వచ్చినా..5 లేదా 6వ రోజు తీవ్ర జ్వరం వచ్చినా , గోళ్లు, పెదవులు నీలం రంగులోకి మారినా మనిషిని ఇబ్బందిపెట్టేలా ఇతరత్రా ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినా ఆస్పత్రికి తీసుకురావాలని ఆయన కోరారు.
కాగా దేశంలో కొత్త కేసుల్లో మళ్లీ రికార్డ్ నమోదైంది. దేశంలో 24 గంటల్లో ఏకంగా 9971మందిలో వైరస్ నిర్ధారణ అయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా వైరస్ ఉధృతి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.