విరాట్ కోహ్లీకి వీరాభిమానిని అంటున్న పాక్ క్రికెటర్ సతీమణి

Update: 2021-06-07 17:30 GMT
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతోమంది అమ్మాయిలకు కలల రాకుమారుడు. ఈయనకు ఇక్కడే కాదు విదేశాల్లోనూ వీరాభిమానులు ఉన్నారు. తనదైన అందం, ఆటతో మెప్పించే విరాట్ ఫ్యాన్ ఫాలోయింగ్ చెప్పనక్కర్లేదు. యువతులు విరాట్ అంటే పడి చచ్చిపోతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. పాక్ అమ్మాయిలూ విరాట్ కు పెద్ద ఫ్యాన్స్. వారిలో కొందరైతే ఏకంగా కోహ్లీని తమకు ఇచ్చేయాలని బహిరంగంగానే అడిగారు.

చాలా మంది యువతులు ఆయనకు ప్రపోజ్ చేసిన విషయం తెల్సిందే. ఓ అమ్మాయి అయితే ఏకంగా స్టేడియంలోనే విరాట్ పెళ్లి చేసుకుంటావా? అంటూ ప్లకార్డు ప్రదర్శించింది. కాగా తాజాగా విరాట్ అభిమానుల్లో మరో వీరాభిమాని వార్తల్లో నిలిచారు. ఆమెకు ఓ ప్రత్యేకత ఉంది. ఆమెనే పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ సతీమణి షామియా అర్జూ. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఫేవరేట్ బ్యాట్స్మన్ ఎవరు అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చింది.

ఫేవరేట్ బౌలర్ అంటే హసన్ అలీనే చెబుతారు. ఫేవరేట్ బ్యాట్స్మన్ ఎవరు అంటూ ఆమెను ప్రశ్నించారు. దానికి సమాధానంగా విరాట్ కోహ్లీకి తాను వీరాభిమానిని అని షామియా వెల్లడించింది. తన ఆట తీరు అంటే చాలా ఇష్టమని పేర్కొంది. పాక్ క్రికెటర్ కు సతీమణి అయిన షామియా స్వస్థలం భారత్ లోని పంజాబ్. ఆమె తల్లిదండ్రులు దిల్లీలో నివసిస్తారు. ఎమిరేట్ ఎయిర్ లైన్స్ లో ఫ్లైట్ ఇంజినీరింగ్ గా పని చేసేటప్పుడు పాక్ క్రికెటర్ హసన్ అలీతో స్నేహం ఏర్పడినట్లు చెప్పింది. క్రమంగా ఇద్దరూ ప్రేమలో పడి ఆపై వివాహమాడినట్లు వివరించింది.

పాక్ క్రికెటర్ సతీమణి మాత్రమే కాకుండా ఆటగాళ్లలోనూ కోహ్లీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆయా క్రీడాకారులు ప్రకటించారు. కోహ్లీ ఆట శైలికి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. పాక్ క్రీడాకారులే కాకుండా ఇతర దేశాల ఆటగాళ్లకు కోహ్లీ రోల్ మోడల్ గా ఉంటాడని వివిధ సందర్భాల్లో వారు మీడియా ముఖంగా వెల్లడించారు.
Tags:    

Similar News