తెర పైకి జార్ఖండ్ కాబోయే సీఎం భార్య

Update: 2019-12-23 11:22 GMT
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చిత్తవుతోంది. బలమైన బీజేపీ ని చిత్తు చేయడం లో జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరెన్ కీలక పాత్ర పోషించాడు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి మూడు సార్లు సీఎం అయిన శిబు సోరెన్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన హేమంత్ సోరెన్ వరుసగా రెండోసారి సీఎం కాబోతున్నారు.

హేమంత్ సోరెన్ తోపాటు ఈ ఎన్నికల్లో ప్రచారం చేసి ఆయనకు అన్నీ తానై వ్యవహరించిన ఆయన భార్య కల్పన సోరెన్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. జార్ఖండ్ లో జేఎంఎం గెలుపులో ఆమె కీలక పాత్ర పోషించారు.

హేమంత్, కల్పనలదీ లవ్ మ్యారేజ్ అంటారు కొందరు. మెస్రాలోని ప్రఖ్యాత బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో హేమంత్ బీటెక్ చదివే రోజుల్లోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని టాక్. అయితే తమ ప్రేమ, వివాహం గురించి వీరిద్దరూ మీడియా ఎదుట అస్సలు ప్రస్తావించకపోవడంతో వీరిది ఏ వివాహం అనేది ఇప్పటికీ అంతుపట్టడం లేదు. ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లిగా గృహిణిగా కల్పన ఇంట్లోనే ఉంటుంది.

తాజా ఎన్నికలకు ముందు హేమంత్ భార్య కల్పన సోరెన్ వార్తల్లో నిలిచింది.  గిరిజన చట్టాలను ఉల్లంఘించి కల్పన సోరెన్ ఈ జనవరిలో 60 ఎకరాల భూమిని కొనడం వివాదాస్పదమైంది. అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. అమ్మకందారులను ఆమె మోసం చేశారని విమర్శలు వచ్చాయి. ఈ కుంభకోణం అసెంబ్లీ లోనూ బీజేపీ నేతలు ప్రస్తావించి హేమంత్ సోరెన్ ను ఇరుకునపెట్టారు. ఈ ఎన్నికల్లో హేమంత్ భార్య భూ కుంభ కోణాన్ని ఎలుగెత్తి చాటారు. అయినా బీజేపీ కి ఈ పరిణామం కలిసి రాలేదు. అయితే భూమి కొనుగోలు లో ఎలాంటి అక్రమాలు లేవని జేఎంఎం ప్రకటించింది.

ఇలా భర్త గెలుపులో కీలకంగా మారి.. ఆర్థిక వ్యవహారాల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్న కల్పన సోరెన్ ఇప్పుడు జార్ఖండ్ సీఎం భార్యగా ఏమేరకు కీరోల్ పోషిస్తారన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News