రాజకీయాల్లో ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. ఆ సందర్భంంలో కొందరు ఆశ్చర్యర రీతిలో స్పందిస్తుంటారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తించిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఫలితాల తర్వాత హింస పెరిగిందని, పరిస్థితులు దిగజారాయని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్‌కర్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ఫైర్ బ్రాండ్ లీడర్, టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఊహించని రీతిలో స్పందించారు.
గవర్నర్ జగ్దీప్‌ను అంకుల్ జీ అని సంబోధిస్తూ టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఘాటు విమర్శలు చేశారు. బెంగాల్‌లో పరిస్థితులు మెరుగవ్వాలంటే ఆయన ఢిల్లీకి వెళ్లి కొత్త జాబ్ చూసుకోవాలని సెటైర్ వేశారు. దీంతోపాటుగా రెండు సూచనలూ చేశారు. ప్రతిపక్షాలను ఎలా నిర్వీర్యం చేయడంలో సీఎం అజయ్ బిష్త్ యోగికి సలహాదారుగా, లేదా మహమ్మారి కాలంలో పకడ్బందీగా దాక్కోవడానికి హోం మంత్రికి అడ్వైజర్‌గా ఉండొచ్చని ఆమె సెటైర్ వేశారు. ఇలా సెటైర్లు వేయడమే కాకుండా పశ్చిమ బెంగాల్ గవర్నర్ పై మహువా సంచలన ఆరోపణలు చేశారు.
పశ్చిమబెంగాల్ రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు ఓఎస్‌డీలుగా బంధువులను నియమించుకున్నారని మహువా మోయిత్రా సంచలన ఆరోపణలూ చేశారు. అంకుల్ జీ అని పేర్కొంటూ ఢిల్లీ వెళ్లడంపై ఆలోచించినప్పుడూ పశ్చిమ బెంగాల్ రాజ్‌భవన్‌లో సెటిల్ చేసిన ఆయన కుటుంబాన్నీ వెంట తీసుకెళ్లాలని కామెంట్ చేశారు. తనదైన శైలిలో సంచలన విమర్శలు చేసే మహువా ఇప్పుడు ఏకంగా గవర్నర్ పై చేసిన కామెంట్లకు ఇటు గవర్నర్ అటు బీజేపీ ఎంపీలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.