కోవాగ్జిన్ కు మరో ఏడాది పట్టె అవకాశం !

Update: 2021-06-24 10:31 GMT
పూర్తి స్వదేశీ పరిజ్ఙానం తో తయారైన తోలి కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ తయారీదారు భారత్‌ బయోటెక్‌ కి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ ఓ) షాక్ ఇచ్చింది. కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగ జాబితా (ఈయూఎల్‌) కు అనుమతించే పత్రాలు సమర్పించేందుకు అనుమతి అయితే ఇచ్చింది కానీ, వినియోగానికి పూర్తి లైసెన్స్ వచ్చేందుకు మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నెల 23న కొవాగ్జిన్‌ కు సంబంధించిన పూర్తి డేటా వివరాలు అందజేసేందుకు ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ఇది కొవాగ్జిన్ టీకాపై పూర్తిస్థాయి సమీక్ష సమావేశం కాదని, వ్యాక్సిన్ మొత్తం డేటా సమర్పించేందుకు ఉద్దేశించిన భేటీగా డబ్ల్యూహెచ్‌ ఓ వర్గాలు వెల్లడించాయి.

కొవాగ్జిన్ అత్యవసర వినియోగ లిస్టింగ్‌ కు డబ్ల్యూహెచ్‌ ఓ నుంచి జులై లేదా సెప్టెంబర్‌ లో అనుమతి లభించవచ్చని భారత్ బయోటెక్ గతనెలలో ప్రకటించింది. కానీ, మరో ఏడాది వరకు వినియోగానికి పూర్తి లైసెన్స్ వచ్చే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాల ప్రకారం, కొత్త లేదా లైసెన్స్‌ పొందని ఉత్పత్తిని ప్రజారోగ్య అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు అనుమతించే ప్రక్రియను ఈయూఎల్‌ గా పరిగణిస్తారు. డబ్ల్యూహెచ్‌ ఓ నుంచి దీనికోసం అనుమతి పొందేందుకు ఇప్పటికే 90 శాతం దస్త్రాలు సమర్పించినట్లు భారత్‌ బయోటెక్‌ గత నెలలో జరిగిన సమావేశంలో కేంద్రానికి వెల్లడించింది. మిగతా డేటాను జూన్‌ లో సమర్పించనున్నట్లు తెలిపింది. పేజ్ 3 ట్రయల్స్ కి సంబంధించిన సమాచారం తో పాటుగా టీకా భద్రత పై పూర్తి వివరాలని డిసిజిఐ కోరినట్లు తెలుస్తుంది. మరోవైపు టీకా సమర్థత 77.8 శాతం అని భారత్ బయో టెక్ ఇటీవలే స్పష్టం చేసింది. మరోవైపు, కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే అనేక దేశాల్లో కరోనా టీకాల పంపిణీ చురుగ్గా కొనసాగుతోంది. అనేక చోట్ల భిన్న రకాల కంపెనీలకు చెందిన కరోనా టీకాలను ప్రజలకు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్‌ లోనూ కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ టీకాలను వేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో స్పుత్‌నిక్‌, బయోలాజికల్‌-ఇ టీకాలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
Tags:    

Similar News