ఐవర్ మెక్టీన్ వాడొద్దని తేల్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Update: 2021-05-11 16:30 GMT
కొవిడ్ కు చికిత్స చేసేందుకు ఫలానా మందునే వాడాలని పక్కాగా ఏమీ లేకపోవటం.. వైద్యులు తాము చేస్తున్నచికిత్సకు రోగులు స్పందిస్తున్న తీరు..తాము ఇస్తున్న మందులకు స్పందిస్తున్న వైనాన్ని ఆధారంగా చేసుకొని.. కేసు.. కేసుకు మందుల్ని మార్చుకుంటూ చికిత్స చేస్తున్నారు. అయితే.. కొన్ని మందుల్ని మాత్రం కామన్ గా వాడేస్తున్నారు. ఈ క్రమంలో అత్యవసర వైద్యం కోసం.. మరికొన్ని వైద్యాల కోసం వినియోగించే మందుల్ని  కూడా ఈ సందర్భంగా వాడుతున్నారు.

అలా వాడిన వాటిల్లో ఏమైనా సానుకూల ఫలితాలు వస్తే.. ఆ మందుల్ని పెద్ద ఎత్తున వాడుతున్నారు. ఆ కోవలోకే వస్తుంది యాంటీ వైరల్ డ్రగ్ ఐవర్ మెక్టీన్. కోవిడ్ చికిత్సలో ఈ ఔషధాన్ని ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ఇది సమర్థంగా పని చేయటంతో పాటు.. మరణ ముప్పును గణనీయంగా తగ్గిస్తుందని కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

అమెరికా జర్నల్ ఆఫ్ థెరప్యూటిక్స్ కూడా ఇదే విషయాన్నిస్పష్టం చేసింది. ఈ నేపత్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్టు డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఒక ట్వీట్ చేసి సంచలనంగా మారారు. క్లినికల్ ట్రయల్స్ లో తప్పించి కోవిడ్ చికిత్సలో ఐవర్ మెక్టీన్ వాడొద్దని డబ్ల్యూ హెచ్ సిఫార్సు చేసిందని.. దీన్ని వాడొద్దన్నారు. ఇప్పుడీ ట్వీట్ పెను సంచలనంగా మారింది. మనోళ్లు ఈ అంశంపై ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
Tags:    

Similar News