కరోనా మహమ్మారి చిన్నా , పెద్ద అన్న తేడా లేకుండా అందరి పై ఒకటే విధంగా విరుచుకుపడుతుంది. మొదటి వేవ్ లో ఎక్కువగా వయస్సు ఎక్కువగా ఉన్న వారికి మాత్రమే ముప్పు ఉండేది. కానీ, ఈ సెకండ్ వేవ్ లో ఆ వయస్సు , ఈ వయస్సు అన్న తేడా లేకుండా అందరిని ఒక ఆట ఆటాడేస్తుంది. తాజాగా కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిన కొన్ని గంటల వ్యవధిలోనే ఓ యువ డాక్టర్ మృతిచెందాడు. ఢిల్లీలోని గురుతేజ్ బహదూర్ ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈశాన్య ఢిల్లీలోని భగీరథీ విహార్ ఏరియాకు చెందిన డాక్టర్ అనాస్ ముజాహిద్ గత జనవరిలో ఎంబీబీఎస్ ఇంటర్న్ షిప్ పూర్తిచేసుకొని , ఇటీవలె గుర్తింపు పొందిన కరోనా హాస్పిటల్ గా మారిన జీటీబీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నాడు.
శనివారం సాయంత్రం వరకు హుషారుగా విధులు నిర్వహించాడు. ఆ తర్వాత తనతోపాటే పనిచేస్తున్న మరో డాక్టర్ అమీర్ సోహైల్ తో కలిసి అతని ఇంట్లో ఇఫ్తార్ విందుకు వెళ్లాడు. ఆ తర్వాత ఆస్పత్రి యాజమాన్యం తమ కోసం ఏర్పాటు చేసిన హోటల్ కు తిరిగి వస్తుండగా అనాస్ తనకు అస్వస్థగా ఉన్నదని చెప్పాడు. దాంతో హోటల్ కు వెళ్లకుండా నేరుగా ఆస్పత్రికి వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకోగా పాజటివ్‌గా తేలింది. విషయం తెలిసిన కాసేపటికే డాక్టర్ అనాస్ ముజాహిద్ కుర్చీలోంచి కుప్పకూలిపోయాడు. అతడిని వెంటనే ఐసీయూలో చేర్చి వైద్య పరీక్షలు నిర్వహించగా మెదడులో రక్తం లీకైనట్లు తేలింది. దాంతో అతడిని న్యూమరాలజీ వార్డుకు తరలించి సర్జరీకి ఏర్పాట్లు చేస్తుండగానే ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. అప్పటివరకు తమ కళ్ల ముందు చలాకీగా తిరిగి తోటి వైద్యుడు ఆకాల మరణంతో ఆసుపత్రిలో విషాద చ్చాయలు అలుముకున్నాయి.