తమిళనాడులో అధికార అన్నాడీఎంకేకు చిన్నమ్మ శశికళ ఫీవర్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు జీవితం ముగించుకుని.. నాలుగేళ్ల జైలు జీవితం తర్వాత తమిళనాడులో శశికళ అడుగుపెట్టారు. తమిళనాడు సరిహద్దుల్లో శశికళ కు ఘన స్వాగతం లభించింది. ఆమె తమిళనాడులోకి ప్రవేశించగానే అనుచరులు ఏకంగా హెలికాఫ్టర్ తో చిన్నమ్మ క్యాన్వాయ్ పై పూల వర్షం కురిపించారు.
ఆమె క్యాన్వాయ్ వెంబడి కొన్ని వందలమంది అభిమానులు పరుగులు తీశారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు శశికళతో సెల్ఫీ తీసుకునేందుకు బైక్ పై ఆమె కాన్వాయ్ ను చాలా దూరం వరకు ఫాలో అయ్యాడు. అయితే.. శశికళ అనుచరులు అతనిని వెనక్కి పంపే ప్రయత్నం చేశారు. ఆ విషయాన్ని కారులో నుండి గమనించిన శశికళ కారు ఆపి మరీ ఆ యువకుడి వద్దకు వెళ్లారు. ఆ యువకుడితో సెల్ఫీ దిగారు. ఆ తర్వాత శశికళ తమిళనాడు సరిహద్దు జిల్లా కృష్ణగిరికి చేరుకున్నారు.
తమిళనాడులో ప్రవేశించగానే ఆమె ప్రయాణిస్తున్న కారులో కాకుండా మరో కారులో ఎక్కడం గమనార్హం. ఇదిలా ఉంటే.. కారుపై అన్నాడీఎంకే జెండాను ఉపయోగించినందుకు శశికళకు కృష్ణగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై శశికళ తరపు న్యాయవాది స్పందిస్తూ.. అన్నాడీఎంకే జెండా శశికళకు ఉపయోగించవచ్చా, లేదా అనే అంశం కోర్టు పరిధిలో ఉందని, ఈ తరుణంలో పోలీసులు ఈ అంశంలో జోక్యం చేసుకోరాదని తెలిపారు.
ఇదిలా ఉంటే.. అన్నాడీఎంకే ప్రభుత్వ ఆదేశాలను, పోలీసుల ఆంక్షలను శశికళ ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. బెంగళూరు నుంచి దాదాపు 100కు పైగా కార్లతో శశికళ తమిళనాడుకు బయల్దేరారు. అయితే, చెన్నై నగరంలో కేవలం 5 కార్లకు మాత్రమే శశికళ కారు వెంట వచ్చేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు, నగరంలో బ్యానర్లు, బాణాసంచాలు కాల్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
శశికళ తమిళనాడు సరిహద్దులోకి ప్రవేశించినప్పటి నుంచి ఈ ఆంక్షలు అమలవుతాయని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. శశికళ తమిళనాడులోని హోసూరుకు చేరుకున్నారు. అక్కడ కాళికా ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న శశికళ, ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చెన్నైకి బయల్దేరారు.