రిలయన్స్ డిజిటల్ ఈ సంవత్సరం ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ద్వారా అతిపెద్ద, మెరుగైన ఆఫర్లు అందిస్తోంది. కస్టమర్లకు విస్తృత శ్రేణిలోని ఎలక్ట్రానిక్స్ మీద సాటిలేని డీల్స్ సౌకర్యం లభిస్తోంది. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్ మరియు , ఆన్ లైన్ షాపింగ్ లో HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ మరియు ఈజీ ఇఎమ్ ఐ మీద 10% క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. అలాగే దేశంలో వేల కొద్ది స్టోర్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ లోని మియాపూర్ లో ఉన్న రిలయన్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్ షోరూంలో భారీ దొంగతనం జరిగింది. మియాపూర్‌లోని మదీనాగూడలో రిలయన్స్ డిజిటల్ షోరూంలో సుమారు రూ.50 లక్షల విలువైన సెల్ ఫోన్ల దొంగతనం జరిగింది.
ఉదయం రిలయన్స్ డిజిటల్ సిబ్బంది షోరూంను తెరిచి లోపలికి వెళ్లి చూడగా సెల్ ఫోన్లన్నీ చెల్లా చెదురుగా పడి ఉండటంతో , స్టోర్ లో దొంగతనం జరిగిందని గుర్తించి సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. షోరూంకు చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం వెదుకుతున్నారు. జాతీయ రహదారి వెంటనే ఉన్న దుకాణంలో దీపావళి పండుగ రోజే ఈ భారీ చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. దొంగతనం జరగడంతో దీపావళి రోజున దుకాణాన్ని మూసివేశారు. రిలయన్స్ డిజిటల్ షోరూంలో అత్యాధునిక భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ దొంగతనం ఎలా జరిగిందన్న అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఫోన్లు ఉన్న చోట నుంచి తీస్తే అలారమ్‌లు మోగే వ్యవస్థ ప్రతి షోరూంలోనూ ఉంటుంది. అయినా దుండగులు ఎలా దొంగిలించారనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.