సోషల్ మీడియాలో.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ట్విట్టర్ లో.. ఫుల్ యాక్టివ్ గా ఉండే రాజకీయ నాయకుల్లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఒకరు. ప్రజలతో రిలేషన్ కొనసాగించేందుకు ఆయన ఎంచుకున్న మార్గాల్లో ఎఫెక్టివ్ గా రన్ అవుతున్నది ఇదే. ప్రజలతో కశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ నిర్వహిస్తూ.. వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉంటారు.
అంతేకాదు.. ఎవరైనా కష్టాల్లో ఉన్నా వారిని ఆదుకునేందుకు కృషి చేస్తారు. కొవిడ్ సెకండ్ వేవ్ లో చాలా మంది ఆక్సీజన్ సిలిండర్లు, మందులు అందించారు. ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆక్సీజన్ సిలిండర్లు అడగ్గా.. ఈ విషయాన్ని వెంటనే ఆ రాష్ట్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అయితే.. ప్రస్తుతం దేశంలో సోషల్ మీడియా నిబంధనల అంశం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా సంస్థలన్నీ భారత్ లో ఆఫీసులు తెరవడం మొదలు.. అసత్యప్రచారాన్ని గుర్తించడం, ఫిర్యాదులు స్వీకరించడం, పరిష్కరించడం వంటి చాలా రూల్స్ విధించింది కేంద్రం.
అయితే.. ఇందులో ఫేస్ బుక్, గూగుల్ వంటివి ఈ నిబంధనలకు ఓకే చెప్పినప్పటికీ.. ట్విటర్ మాత్రం ఇంకా స్పందించలేదు. ఈ నేపథ్యంలో.. భారతదేశంలో ట్విట్టర్ ను నిషేధిస్తే.. మీరు ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను ఇష్టపడతారని ఒక నెటిజన్ కేటీఆర్ ను అడిగారు. దానికి సమాధానం ఇచ్చిన కేటీఆర్.. అదే జరిగితే తాను సోషల్ మీడియాను పూర్తిగా విడిచిపెట్టవచ్చని చెప్పారు.