వారేమీ అల్లాటప్పా పారిశ్రామిక వేత్తలు కారు. దేశంలోనే అత్యున్నత కార్పొరేట్ సంస్థలకు అధినేతలు. వారు ఏదైనా రాష్ట్రానికి వెళుతున్నా.. ఏదైనా వ్యాపార కార్యకలపాలకు వెళుతున్నా.. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అక్కడి ముఖ్యమంత్రులు కోరటం.. వారి పర్యటనలో భాగంగా సదరు దిగ్గజ పారిశ్రామికవేత్తల్ని కలిసేలా వారి షెడ్యూల్ ను సర్దుబాటు చేస్తారు. కానీ.. ఇందుకు భిన్నమైన పరిస్థితి తెలంగాణలో మాత్రమే చోటు చేసుకుంటుందని చెబుతారు.
తాజాగా దిగ్గజ ఐటీ సంస్థగా.. పలు వినియోగవస్తువలకు ఉత్పత్తిదారుగా వ్యవహరించే విప్రో సంస్థ అధినేత అజీమ్ ప్రేమ్ జీ తెలంగాణకు వచ్చారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సమీపంలోని ఈ-సిటీలో రూ.300 కోట్లతో 30 ఎకరాల్లో విప్రో సంస్థ ఏర్పాటు చేసిన వినియోగ ఉత్పత్తి పరిశ్రమను తాజాగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్.. సబితా ఇంద్రారెడ్డిలు హాజరయ్యారు. అజీమ్ ప్రేమ్ జీ లాంటి పారిశ్రామికవేత్త రాష్ట్రానికి వచ్చినప్పుడు.. అందునా వ్యాపార కార్యకలాపాల కోసమైనప్పుడు అలాంటి వ్యాపార దిగ్గజాన్ని ముఖ్యమంత్రి కలుస్తుంటారు. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రూటు సపరేటు అన్నట్లు ఉంటుంది.
ఆయన ఎవరిని ఇట్టే కలవరు. ఆయన్ను కలవాలంటే ఆ లెక్కలే వేరంటారు. ఇప్పుడు అజీజ్ ప్రేమ్ జీ కానీ.. గతంలో రతన్ టాటా వచ్చిన కార్యక్రమానికి సైతం కేసీఆర్ వెళ్లలేదు. ఆ సమయంలో ఆయన పాం హౌస్ (అప్పట్లో ఫార్మర్ హౌస్ గా ఆయన ప్రకటించలేదు) లోనే ఉన్నారు. రాష్ట్రానికి వచ్చిన ఒక దిగ్గజ పారిశ్రామికవేత్తను కలిసే కన్నా.. తన ఫార్మర్ హౌస్ లో ఉండేందుకు మక్కువ చూపిన కేసీఆర్ తీరుపై అప్పట్లో విస్మయం వ్యక్తమయ్యేది.
దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి ఉందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అయితే.. ఇదంతా కూడా కొడుకును భావి ముఖ్యమంత్రిగా తయారు చేసే ప్లానింగ్ లో భాగంగానే ఇదంతా చేస్తుంటారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఏమైనా.. పారిశ్రామిక దిగ్గజాలు తెలంగాణకు వచ్చినా.. వారికి చిన్నసారు కేటీఆర్ తో మాటా మంతినే తప్పించి.. పెద్ద సారు దర్శన భాగ్యం సైతం దక్కదన్న విమర్శ వినిపిస్తోంది.
అజీమ్ ప్రేమ్ జీ హాజరైన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన తత్త్వాన్ని పొగిడేశారు. ప్రేమ్ జీ అరుదైన గొప్ప పారిశ్రామికవేత్తగా పొగిడేసిన మంత్రి కేటీఆర్ మాటలు వినేందుకు బాగానే ఉన్నా.. అంతటి కార్పొరేట్ దిగ్గజం హాజరైన కార్యక్రమానికి సీఎం హాజరు కాకపోవటం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం లభించని పరిస్థితి.