ఏదైనా మార్పు జరగడానికి ఒక్క క్షణం చాలు అని చెప్తాం..ఇప్పుడు అదే జరుగుతుంది. ఒకే ఒక్క మహమ్మారి దెబ్బకి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయి ...ఇంకా రాబోతున్నాయి. ఇక ఈ మహమ్మారి రాకమునుపు దేశీయ విమాన ప్రయాణం చేయాలంటే చాలా సులభం. కేవలం పాన్ లేదా ఆధార్ ఉంటె చాలు. టికెట్ కొనుక్కొని ప్రయాణం చెయ్యొచ్చు. అయితే, ఈ మహమ్మారి చూపించిన సినిమాకి మొత్తం మారిపోయింది.
పాజిటివ్ కేసులుపెరిగిపోతున్న తరుణంలో దేశంలో కష్టాలు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో విమాన సర్వీసులను పూర్తిగా ఆపేశారు. కేవలం మెడికల్, ఎమర్జేన్సీ, ప్రభుత్వం అనుమతించిన వాళ్లకు మాత్రమే ప్రయాణాలు చేస్తున్నారు. అయితే, ఈ మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో విమాన ప్రయాణం పూర్తిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణం చేయాలనుకునే వ్యక్తులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
అంతేకాదు, ప్రయాణం చేసే వాళ్ల ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలను నమోదు చేయాల్సి ఉంటుంది. లేదంటే రక్తపరీక్ష ద్వారా కరోనా టెస్టులు నిర్వహించిన తరువాతే ప్రయాణం ఉండొచ్చు. ఇక విమానాల్లో ప్రత్యేకంగా బిజినెస్ క్లాస్ ను ఐసోలేషన్ క్లాస్ గా మార్చే అవకాశం ఉన్నది. వీటిని చిన్న చిన్న క్యాబిన్ లుగా మార్చి ఐసోలేషన్ క్లాస్ గా రూపిందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, ఎకానమీ క్లాస్ లో రెండు సీట్ల మధ్యలో ఒక సీట్ ను వెనక్కి తిప్పి ఉంచేలా విమాన సంస్థలు రెడీ అవుతున్నాయి. మొత్తంగా విమానయాన రంగం భారీ మార్పులకి శ్రీకారం చుట్టబోతుంది అని తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే ఖరీదైన విమాన ప్రయాణం మరింత ప్రియం కాబోతోంది.