కొన్నాళ్లుగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకురాలు, గుంటూరు జిల్లా తాడికొండ నియోజక వర్గం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చుట్టూ మరింతగా ఉచ్చు బిగుసుకుంటోందని అంటున్నారు పరిశీలకు లు. కొన్నాళ్లుగా.. ఉండవల్లిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఎందుకంటే.. ఆమె నియోజకవర్గంలోనూ ఉండడం లేదని.. క్షేత్రస్థాయిలో నాయకులకు కూడా అందుబాటులో ఉండకపోవడం.. పైగా రాజధాని గ్రామాల్లో పర్యటించి.. తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. ఫలితంగా పార్టీకి తలనొప్పులు తీసుకురా వడం.. వంటివి.. కూడా.. శ్రీదేవికి మైనస్ మార్కులు పడేలా చేశాయి. ఇవన్నీ..ఇలా ఉంటే.. స్థానిక నేతలతో వివాదాలు కూడా.. ఉండవల్లి చుట్టూ దుమారం రేపేలా చేశాయి.
అయినప్పటికీ.. నియోజకవర్గంపై పట్టుంది కదా.. ఇక, ఇబ్బంది లేదని.. శ్రీదేవి వర్గం భావిస్తూ.. వచ్చింది. ఈ నేపథ్యంలో ఎవరో గిట్టనివారే ఆమెపై వ్యతిరేకంగా ఉన్నారని.. ప్రచారం చేస్తూ.. వస్తున్నారు. అయితే.. తాజా గా జరిగిన పరిషత్ ఎన్నికల్లో.. ఇక్కడ అన్నీ తానై.. శ్రీదేవి వ్యవహరించారు.
అయితే.. ఇక్కడ వైసీపీకి గట్టి ఎదురు దెబ్బతగిలింది. సొంత నియోజకవర్గం తాడికొండలో ఊహించని ఫలితం వచ్చింది. నియోజకవర్గం పరిధిలోని ఫిరంగిపురం మండలంలో రెండు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ రెండు చోట్లా టీడీపీ జెండా ఎగిరింది. ఈ రెండు స్థానాలను అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
తొలుత.. ఇక్కడి బాధ్యతలను వేరే వారికి అప్పగించాలని నిర్ణయించారు. అయితే.. ఉండవల్లి మాత్రం తనే అన్నీ అయి.. ఇక్కడ వ్యవహరించి.. పార్టీని నిలబెడతానని.. తన సత్తా నిరూపిస్తానని.. శ్రీదేవి.. హామీ ఇచ్చారు. అన్ని బాధ్యతలు ఆమే చూసుకున్నారు. ప్రచారం నుంచి ప్రజలను కలిసే వరకు.. బ్యానర్లలో నూ.. ఆమె తన ఫొటోలను ముద్రించుకున్నారు.
అంతా తన కనుసన్నల్లోనే నడిపించారు. తీరా చూస్తే.. వైసీపీ నేతలు చేససిన ఏ ప్రయత్నాలు ఫలించలేదు. గుండాలపాడులో 457 ఓట్లు, వేమవరం 93 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.దీంతో తొలిసారి.. రాజధాని ప్రాంతంలో రెండు స్దానాల ఓటమితో వైసీపీ డీలాపడినట్లయ్యింది.
మరి దీనికి ఉండవల్లిని ఎలా టార్గెట్ చేస్తారో.. చూడాలని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. గత కొన్నాళ్లుగా ఇక్కడ ఉండవల్లికి వ్యతిరేకత పెరుగుతున్న దరిమిలా.. ఆమె సత్తా నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో వచ్చిన ఒకే ఒక్క అవకాశం చేజారి పోవడం.. పైగా రాజధాని ప్రాంతం కావడం.. ఇక్కడ పార్టీ ఇలా వెనుకబడి పోవడం వంటివాటిపై పార్టీ నేతల మధ్య అంతర్మథనం సాగుతోంది. మరి దీనిపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఏదేమైనా.. ఉండవల్లికి మాత్రం మరింత ఉచ్చు బిగిసిందనే అంటున్నారు పరిశీలకులు.