ఈమధ్యనే బీజేపీలో చేరిన రాములమ్మ పాత పరిచయస్తులకు గాలం వేస్తున్నారట. కాంగ్రెస్ పార్టీలో చాలా కాలమే ఉన్నారు విజయశాంతి. కొంతకాలం క్రియాశీలకంగా ఉండటం కొంతకాలం స్తబ్దుగా ఉండటం ఈ రాములమ్మకు అలవాటే. కారణలు ఏవైనా కానీండి కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటిలో ఒకపుడు యాక్టివ్ గా పనిచేసిన కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నేతలతో బాగానే పరిచయాలున్నాయి.
అలాంటి రాములమ్మ బీజేపీలో చేరిన తర్వాత వాళ్ళందరితో టచ్ లోకి వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లోని నేతలతో తనకున్న పరిచయాలను బీజేపీలోకి చేర్చే విషయంలో వాళ్ళకు గాలం వేస్తున్నారట. బీజేపీలోకి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని నేతలకు భరోసా ఇస్తున్నారట. ఎలాగైనా కేసీయార్ ను దెబ్బతీయాలనే పంతంతో విజయశాంతి ఉన్నారు.
అందుకని గట్టి నేతలుగా కాంగ్రెస్ లోపాపులరైన వారిలో ఎంతమందిని వీలైతే అంతమందినీ బీజేపీలోకి చేరిస్తే తనకు కూడా వ్యక్తిగతంగా మైలేజి వస్తుందన్నది విజయశాంతి ఆలోచనగా కనిపిస్తోంది. ఒకపుడు టీఆర్ఎస్ మెదక్ ఎంపిగా రాములమ్మ పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఓడిపోయినా పరిచయాలైతే అలాగే ఉన్నాయట. అందుకనే ఒకేసారి ఇటు టీఆర్ఎస్ అటు కాంగ్రెస్ నేతల్లో కొందరితో టచ్ లోకి వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది.
మొన్నటి దుబ్బాక అసెంబ్లీలో బీజేపీ గెలవటానికి విజయశాంతి తెరవెనుక నుండి పనిచేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. దుబ్బాక ఎన్నిక సమయానికి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా రాములమ్మ మాత్రం ఎక్కడా కనబడలేదు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్ధికి వ్యతిరేకంగా బీజేపీని గెలిపించే ఉద్దేశ్యంతోనే రాములమ్మ తన పాత పరిచయాలను ఉపయోగించి కమలంపార్టీ గెలుపుకు పనిచేశారని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా కేసీయార్ కు వ్యతిరేకంగా రాములమ్మ చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా ?