ఇపుడిదే ప్రశ్న యావత్ ప్రపంచాన్ని టెన్షన్ పెట్టేస్తోంది. కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడుగా కొన్ని దేశాలు టీకాలు తయారు చేస్తున్న విషయం తెలసిందే. రష్యా, బ్రిటన్, అమెరికా, ఇండియా, చైనా లాంటి దేశాలు ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నాయి. పై దేశాల్లో రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కూడా జరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే అసలు టీకా పనితీరుపై అనేకమందిలో సందేహాలు మొదలయ్యాయి. టీకా వేసుకున్న తర్వాత మళ్ళీ కరోనా వైరస్ రాదని గ్యారెంటీ ఏమన్నా ఉందా ? అన్నదే అందరిలో మెదులుతున్న ప్రధానమైన ప్రశ్న.
ఈ ప్రశ్నకు ఏ దేశంలో శాస్త్రజ్ఞులు కూడా సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ప్రపంచానికి కరోనా వైరస్ అనేది పరిచయటం అవటం ఇదే మొదటిసారి కాబట్టి. దీనికి ఎంత తొందరగా మందు కనిబెడితే ప్రపంచం విపత్తు నుండి అంత తొందరగా కోలుకుంటుంది. ఈ వైరస్ వల్ల యావత్ ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. సుమారు 50 దేశాల్లో ఆర్ధిక పరిస్ధితి నేల మట్టమైపోవటంతో దివాలా తీసేశాయి. అలాగే కొన్ని వందల దేశాల ఆర్ధిక పరిస్ధితి తల్లకిందులైపోయాయి.
ఇతంటి భయంకరమైన వైరస్ కు అరికట్టాలంటే ఏదో ఓ మందు తక్షణావసరం. అసలు మందే లేకపోవటం కన్నా ఏదో ఓ మందు కనిపెట్టడమే ప్రధానమని ప్రపంచం సర్దుకుని పోతోంది. ఇండియాలో చేస్తున్న క్లినికల్ ట్రయల్స్ మొదటి దశలో 90 శాతం పనితీరు కనబరుస్తున్న డోసు రెండో సారి ఇచ్చినపుడు కేవలం 62 శాతమే పనితీరు కనబరిచింది. దాంతో మొదటి రెండు డోసుల పనితీరు మధ్య వ్యత్యాసం సుమారు 28 శాతం తగ్గిన విషయాన్ని నిపుణులు గుర్తించారు. అయితే దానికి వాళ్ళు చెప్పే సమాధానం ఏమిటంటే మొదటిసారి డోసు ఇచ్చినపుడే వైరస్ ను తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి 90 శాతానికి పెరుగుతుందట. మొదటి డోసు ప్రభావం ఇంకా మన శరీరంలో ఉంటుంది కాబట్టే రెండో డోసు పనితీరు 62 శాతమే కనిపిస్తోందని చెబుతున్నారు. అసలు వైరస్ కు మందే లేకపోవటం కన్నా 62 శాతమో లేకపోతే 90 శాతం పని చేసే మందు తయారు చేయటమే మేలుకదా అని నిపుణులు ఎదురు ప్రశ్నిస్తున్నారు.
మిగిలిన దేశాల సంగతి ఎలాగున్న మనదేశంలో ఔషదాల పనితీరు 60-70 శాతం రిజల్టు వచ్చినా టీకా వేసుకునేందుకు అనుమతులు లభించేస్తాయని సీరమ్ సీఈవో అధర్ పూనావాల ఆశాభావంతో ఉన్నారు. ఎందుకంటే భారతీయ డ్రగ్ రెగ్యులేటరీ సంస్ధ ప్రమాణాల ప్రకారం డ్రగ్ పనితీరు 30-50 శాతం బాగున్నా వాడకానికి అనుమతులు వచ్చేస్తుంది. అలాంటిది కరోనా వైరస్ విరుగుడు టీకా ప్రయోగాల దశలోనే 62 శాతం పనితీరు కనిపిస్తోంది కాబట్టి వాడకానికి అనుమతులు రావటంలో కష్టమేమీ లేదని పూనావాల అంటున్నారు. కాకపోతే ఒకసారి టీకా వేసుకున్న తర్వాత ఆ మందు ఎంత కాలం పనిచేస్తుంది అనే విషయంలో ఎవరకీ స్పష్టత లేదు. గుడ్డికన్నా మెల్ల మేలన్న ఏకైక పద్దతిలోనే ప్రస్తుతం టీకా తయారీపైన అందరు ఆశాభావంతో ఉన్నారు.
అమెరికాలో తయారు చేస్తున్న వ్యాక్సిన్ కన్నా భారత్ లో క్లినికల్ ట్రయల్స్, రష్యా స్పుత్నిక్ –వి టీకాలు ఎక్కువ ప్రభావం చూపుతాయని అనుకుంటున్నారు. ఎందుకంటే అమెరికా కంపెనీ ఫైజర్ తయారు చేస్తున్న టీకా 70 డిగ్రాల ఉష్ణోగ్రతలో స్టోర్ చేయాల్సుంటుంది. అదే మనదేశం, రష్యా తయారీ టీకా మాత్రం 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా స్టోర్ చేయవచ్చు. పైగా ధరలో కూడా చాలా వ్యత్యాసముంది. అందుకనే సీరమ్ కంపెనీ సహకారంతో తయారయ్యే టీకాపైనే అందరి దృష్టి ఉంది. చూద్దాం ఎంత తొందరలో టీకా వాడుకలోకి వస్తుందో.