అర్నాబ్ చాట్ లో త‌ప్పులేదు - రిప‌బ్లిక్ టీవీ

Update: 2021-01-25 16:30 GMT
త‌మ ఛానెల్ పై, ఎడిట‌ర్ అర్నాబ్ గోస్వామిపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌ని, ఆయ‌న ఎలాంటి త‌ప్పూ చేయ‌లేద‌ని  రిప‌బ్లిక్ టీవీ ప్ర‌క‌టించింది. వాట్స‌ప్ సంభాష‌ణల ద్వారా.. ప్ర‌భుత్వం అధికారిక ర‌హ‌స్యాల‌ను అర్నాబ్ బ‌య‌ట పెట్టారంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోప‌ణ‌లు స‌త్య‌దూర‌మ‌ని చెప్పుకొచ్చింది. టైమ్స్ నౌ ఛాన‌ల్ టీఆర్పీ రేటింగ్స్ పెంచుకునేందుకు ప్ర‌య‌త్నించింద‌ని రిప‌బ్లిక్ టీవీ ఆరోపించింది. బార్క్ మాజీ సీఈవోతో అర్నాబ్ చేసిన వాట్స‌ప్ చాట్ లో ఎక్క‌డా త‌ప్పు చేసిన‌ట్లు లేద‌ని చెప్పింది.

దేశవ్యాస్తంగా సంచలనం సృష్టించిన టీఆర్‌పీ కుంభకోణం కేసును ముంబై పోలీసులు విచారిస్తుండగానే... రిపబ్లిక్ టీవీ చీఫ్ ఆర్నాబ్ గోస్వామి, బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తా సహా పలువురి మధ్య జరిగిన వాట్స‌ప్‌ సంభాషణలు లీకైన విషయం తెలిసిందే.

దాదాపు 500 పేజీలకు పైగా ఉన్న ఈ వాట్సాప్ చాటింగ్‌.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంట్లో మంత్రులు అందరూ మన వెనకే ఉన్నారని అర్నాబ్ గోస్వామి వ్యాఖ్యానించాడని ప్ర‌చారం సాగిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా.. రక్షణ రహస్యాలు సహా అనేక కీలక అంశాల గురించి ఇద్దరి మధ్య సంభాషణలు జరిగాయని వార్త‌లు వ‌చ్చాయి. ఈ సంభాషణలు దేశ వ్యాప్తంగా అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ నేప‌థ్యంలో రిప‌బ్లిక్ టీవీ పై విధంగా స్పందించింది.
Tags:    

Similar News