జైలు నుండి పారిపోతే పట్టుకోరు...ఎక్కడో తెలుసా ?

Update: 2021-03-09 23:30 GMT
సమాజంలో తప్పు చేసిన వారిని జైల్లో వేస్తారు. అది సాధారణ విషయమే. కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పు చేయని వారిని కూడా జైల్లో వేస్తుంటారు. అయితే, న్యాయవ్యవస్థలో ఉన్న ఎన్నో దారులని ఉపయోగించుకొని ఎంతోమంది బయట తిరుగుతుంటారు. మరికొందరు మాత్రమే జైల్లో ఏళ్ల తరబడి మగ్గిపోతుంటారు. కొందరు జైల్లోనే జీవితాన్ని ముగిస్తారు కూడా. అయితే, మనదేశంలో శిక్ష పడిన ఖైదీ జైల్లో ఉన్న సమయంలో తప్పించుకోవడం చాలా నేరం. అలా శిక్ష అనుభవిస్తున్న సమయంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. జైలు నుండి తప్పించుకోగానే పోలీసులు అనేక రకాలుగా వెదికి ఎలాగోలా పట్టుకొని మళ్లీ జైల్లో పడేస్తారు. కానీ, కొన్ని దేశాల్లో మాత్రం జైల్లో నుండి ఖైదీలు తప్పించుకున్నప్పటికీ  వారిని మళ్లీ పట్టుకొని జైల్లో వేయరు. దాన్ని ఓ నేరంగా కూడా పరిగణించరట. అసలు జైలు నుండి ఖైదీలు పారిపోయినా పట్టుకొని ఆ దేశాలు ఏవి , అందుకు తగ్గ కారణాలేవో ఇప్పుడు చూద్దాం.

వివరాల్లోకి వెళ్తే .. మన దేశంలో అయితే జైల్లో ఖైదీలు పారిపోతే మళ్లీ పట్టుకొని జైల్లో వేస్తారు. కానీ, జర్మనీ , బెల్జియం ,ఆస్ట్రియా , మెక్సికో ,డెన్మార్క్ వంటి దేశాల్లో ఖైదీలు జైల్లో నుండి పారిపోవడం నేరం కాదు. 1880 లో ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. మనిషి స్వేచ్ఛ ను కోరుకోవడం తప్పు కాదనేది దీన్ని సారాంశం.  అయితే , కొన్ని షరతులు ఉన్నాయి. జైలు నుండి పారిపోయే వారు జైలు ఆస్తులని ధ్వంసం చేయకూడదు. అలాగే వేరే వారి సహాయం తీసుకోకూడదు. ఆఖరికి జైలు ఆస్తులైన జైల్లో ఇచ్చిన దుస్తులతో కూడా పారిపోకూడదు. నగ్నంగా మాత్రమే అక్కడి నుండి పారిపోవాలి.
Tags:    

Similar News