ఆనందయ్య మందులో ఉన్న మూలికలివే!

Update: 2021-05-26 01:30 GMT
నెల్లూరు జిల్లాలో కోవిడ్కు ఆనందయ్య చేస్తున్న వైద్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది నాటు మందు అని తేల్చినా కరోనాను తగ్గిస్తుండడంతో అందరికీ ఆశలు రేపుతోంది.

ఆనందయ్య వాడే మందులు కొన్ని వేల ఏళ్లు ఆయుర్వేదంలో వాడే వన మూలికలే అని తేలింది. అవి రకరకాల వ్యాధులను తగ్గిస్తాయని చెబుతున్నారు. మన రోగ నిరోధక శక్తిని పెంచేవే అని తేల్చారు. కొన్ని రకాల రుగ్మతలు తగ్గిస్తాయంటున్నారు.

ఆనందయ్య కరోనా నివారణ కోసం వాడే వనమూలికలు చూస్తే అవి ప్రధానంగా కరోనా దెబ్బతీసే ఊపిరితిత్తులు, దగ్గు,జలుబును ఇతర లక్షణాలను నివారించేవే కావడం విశేషం.

ఆనందయ్య తన కరోనా ఆయుర్వేద మందులో వాడేవి..
-తెల్ల జిల్లేడు పువ్వు: ఇది పొడిదగ్గు, శ్లేష్మం, వగర్పు తగ్గుతాయి.ఆమ్లం కన్నా తగ్గుతుంది.

-మారేడు: వాత కఫాలను తగ్గిస్తుంది. వాంతిని హరిస్తాయి.

-నేరేడు చిగుళ్లు: పైత్యం, వాంతులు తగ్గిస్తుంది. తేనె కలిపితే మంచి ఫలితం ఉంటుంది.

-వేప ఆకులు: జ్వరం, మే:, కుష్టు, పిత్తం, విదోషాలు, వ్రణములను హరిస్తుంది.

-డావరదంగి: కఫం సంబంధ వాపులను తగ్గిస్తుంది. కాసశ్వాసలను హరిస్తుంది.

-పిప్పింట ఆకుల చెట్టు: శ్లేష్మం, క్రిములను పొగొడుతుంది. దగ్గులు తగ్గిస్తుంది.

ఇవే కాక నేల ఊసిరి, గుంటకలగర ఆకు, కొండ పల్లేరు ఆకు, ముళ్లవంకాయ, వాకుడు చెట్టు , తోక మిరియాలు ఇవన్నీ కూడా రోగ నిరోధకతను పెంచి కరోనా లక్షణాలు తగ్గించే దగ్గు, జలుబు, ఆక్సిజన్ కొరతను నివారించేవి కావడం విశేషం. ఈ మూలకలన్నీ శాస్త్రమైనవే
Tags:    

Similar News