టెండూల్కర్ డ్రైవ్', 'కోహ్లీ క్రెసెంట్', 'దేవ్ టెర్రెస్' తదితర పేర్లు ఆస్ట్రేలియా దేశంలో కనిపిస్తున్నాయి. భారత్ క్రికెట్ ఆటగాళ్ల పేర్లు ఆస్ట్రేలియాలో మార్మోగుతున్నాయి. భారత క్రికెట్ ఆటగాళ్లపై ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వారిని అభిమానులు ఎంతగానో ఆరాధిస్తారు. ఆ అభిమానంతోనే ఆస్ట్రేలియాలో వీధులకు మన వారి పేర్లు పెడుతున్నారు.
ఆస్ట్రేలియాలో కూడా భారత క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ పేర్లను తమ వీధులకు పెట్టుకోవడం ఆశ్చర్యమేస్తోంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ సిటీలో రాక్‌బ్యాంక్ ప్రాంతంలోని ఓ ఎస్టేట్‌లోని వీధులకు 'టెండూల్కర్ డ్రైవ్', 'కోహ్లీ క్రెసెంట్', 'దేవ్ టెర్రెస్' అని పేరు పెట్టుకున్నారు. ఈ రాక్‌బ్యాంక్ ప్రాంతం మెల్టన్ కౌన్సిల్ పరిధిలోకి వస్తుంది.
ఈ ప్రాంతంలో మన భారతదేశానికి చెందిన వారు ఇళ్లని ఎక్కువగా కొనుగోళ్లు చేస్తుంటారు. అందువల్ల వారిని ఆకర్షించడానికి భారత క్రికెటర్ల పేర్లు పెట్టారు. మిగతా వారిని కూడా ఆకర్షించడానికి అంతర్జాతీయ ఆటగాళ్ల పేర్లు కూడా ఎస్టేట్‌లోని వీధులకి పెట్టారు.
వా స్ట్రీట్, మియాందాద్ స్ట్రీట్, అంబ్రోస్ స్ట్రీట్, సొబెర్స్ డ్రైవ్, కలిస్ వే, హాడ్లీ స్ట్రీట్, అక్రమ్ వే అని పెట్టారు. ఇలా క్రికెటర్ల పేర్లు పెట్టడంతో భారతీయుల నుంచి భారీ స్పందన వస్తుందని తెలుస్తోంది. అందుకే అధికంగా అమ్మకాలు జరుగుతున్నాయని ఎస్టేట్ నిర్వహణాధికారి చెబుతున్నారు. ఎస్టేట్ నిర్వాహణాధికారుల ప్రతిపాదించిన వీధి పేర్లను సిటీ కౌన్సిల్ ఆమోదిస్తుంది. ఎంఎస్ ధోనీ, రాహుల్ ద్రవిడ్, కుమార సంగక్కర పేర్లు కూడా పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. త్వరలోనే వారి పేర్ల మీదుగా కాలనీలు.. వీధులు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.