అంగారక గ్రహం ఓ అంతుచిక్కని సబ్జెక్టు. అక్కడ గతంలో జీవరాశి ఉండేదా? నదులు, సముద్రాలు, కొలనులు, సరస్సులు ఉండేవా? ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్న. అంగారక గ్రహం లోపల అనేక విలువైన ఖనిజ సంపద ఉందా? ఈ విషయంపై కూడా అనేక ఏళ్లుగా ఎన్నో పరిశోధనలు సాగుతున్నాయి. అంగారకుడిపై జీవరాశి కూడా నివసించిందన్న వాదనా ఉంది. అయితే ఇదంతా ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. తాజాగా ఈ విషయంపై నాసా కొన్ని సరికొత్త విషయాలను కనిపెట్టింది.
అంగారక గ్రహం అంతర్భాగంలో నీటి జాడ ఉన్నట్టు నాసా పరిశోధనలో తేలింది.
అంతేకాక అంగారక గ్రహంపై అనేక నీటి కొలనులు, సరస్సులు కూడా ఉన్నాయని ఈ పరిశోధన తేల్చింది. కానీ అవి ఇప్పుడు లేవు. బిలియన్ ఏళ్ల క్రితం ఉండేవి. అయితే ఆ నీరు ఇప్పుడు ఎక్కడికి పోయింది అనే విషయంపై నాసా విస్తృత పరిశోధనలు చేస్తున్నది.నాసా ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం.. మార్స్ పై ఉన్న నీరు 30 నుంచి 99 శాతం వరకు గ్రహం అంతర్భాగంలోని ఖనిజాలలో ఉన్నట్టు అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
ఈ మేరకు కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (జేపీఎల్) సంయుక్తంగా కొన్ని పరిశోధనలు సాగించాయి.
బిలియన్ ఏళ్ల క్రితం ఇక్కడ నీరు ఉండేదని అయితే ప్రస్తుతం
సముద్రరూపంలో నీరు, గ్రహం మొత్తాన్ని నీటితో కప్పివేసిందనే విషయాన్ని కనుగొన్నారు. బిలియన్ ఏళ్ల తరువాత, మార్స్ పై ప్రస్తుతం ఉన్న శుష్కనేలలతో పొడిగా ఉండే వాతావరణం ఏర్పడి ఉండొచ్చని తెలిపారు. అంగారక గ్రహంపై గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండటం వల్ల ఈ నీరంతా అంతరిక్షంలోకి వెళ్లిపోయి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.అంగారక గ్రహం అనేది ఓ అంతుచిక్కని రహస్యం అక్కడ అనేక విషయాలపై ఇప్పటికే పరిశోధనలు సాగుతూనే ఉంటాయి. తాజాగా ఈ షాకింగ్ నిజం వెలుగు చూసింది