ఈ బ్లడ్ గ్రూపు వారినే దోమలు ఎక్కువగా కుడతాయట..

Update: 2019-10-15 01:30 GMT
దోమ.. చిన్న ప్రాణి ఇదీ.. కానీ ఇది మనషి ప్రాణాలనే తీస్తుంది.. దీనికోసం ప్రతి కుటుంబం నెలకు రూ.200 నుంచి రూ.400 వరకు ఖర్చు చేస్తారంటే అతిశయోక్తి కాదు.. దోమలు సామాజిక వాదులు.. అందుకే తర తమ బేధాల్లేకుండా అందరినీ కుడుతాయి.. ఇటీవల దోమల వల్ల సంక్రమిస్తున్న డెంగ్యూ వల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. ఎన్నో రకాల రోగాలను మోసుకొచ్చే దోమలు ప్రత్యేకంగా కొందరిని మాత్రం తెగ కుట్టేస్తాయి.? ఎందుకు.? ఎవరిని ఎక్కువగా కుడతాయనే దానిపై ఇటీవల చేసిన ఓ పరిశోధనలో షాకింగ్ వాస్తవాలు బయటపడ్డాయి..

చర్మంపై ఉన్న బ్యాక్టీరియాతోపాటు చర్మ నుంచి వెలువడే రసాయనాలు అంటే దోమలకు చాలా ఇష్టమట.. కార్బన్ డయాక్సైడ్ ను 160 మీటర్ల దూరంలో ఉండగానే అవి గుర్తు పట్టగలవు. అందుకే మనం నిద్రపోతున్నప్పుడు విసర్జించే అత్యధిక కార్బన్ డయాక్సైడ్ వల్ల రాత్రి సమయంలోనే ఎక్కువగా ఎటాక్ చేసి రక్తాన్ని తెగ పీల్చేస్తాయి.. ఇక   గర్భిణులను ఎక్కువగా కుట్టేందుకు దోమలు ఆసక్తి చూపిస్తాయట.. ఎందుకంటే సాధారణ మహిళలకంటే గర్భిణులు చివరి 7 నెలల సమయంలో విడిచే శ్వాసలో 21శాతం కంటే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. అందుకే దోమలు గర్భిణుల్ని కుడతాయని పరిశోధనల్లో తేలింది.

ఇంకో ఆసక్తికర విషయాన్ని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. దోమలు ఎక్కువగా ‘ఓ’ బ్లడ్ గ్రూపు ఉన్న వారిని రెండు రెట్లు అధికంగా కుడుతాయని పరిశోధనలో వెల్లడైంది. ఏ గ్రూపు వారితో పోల్చితే ‘ఓ’ బ్లడ్ గ్రూపు ఉన్నవారు ఎక్కువగా దోమకాటుకు గురవుతుంటారని తేల్చారు.

మగదోమలు పువ్వులు, తేనెపై ఆధారపడి బతికేస్తాయి.. అయితే ఆడదోమలు మాత్రమే మనుషుల రక్తాన్ని తాగుతాయని ఎప్పుడో శాస్త్రవేత్తలు చెప్పిన సంగతి తెలిసిందే..

ఇక మరో వాస్తవం కూడా పరిశోధకులు గుర్తించారు.. మనం శారీరకంగా బాగా పనిచేసినప్పుడు మన చర్మం నుంచి లాక్టిక్ ఆమ్లం, యూరిక్ ఆమ్లం, అమ్మోనియా వంటి రసాయనాలు విడుదలవుతాయి. అందుకే చెమటపట్టిన దేహాల్ని కుట్టడానికి దోమలు మరింత ఇష్టం చూపిస్తాయని పరిశోధకులు గుర్తించారు.
Tags:    

Similar News