ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని దేశ ప్రజలను కోరింది. ఈ మేరకు ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీని కూడా చేపట్టింది. అయితే జాతీయ జెండాను ఎగురవేయాలన్నా, మరే విధంగానైనా త్రివర్ణ పతాకాన్ని వాడుకోవాలన్నా కొన్ని నియమ నిబంధనలు పొందుపరిచింది. అవి...
జాతీయ జెండాను అత్యంత గౌరవంగా చూడాలి. జెండాను ఎగురవేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అది చిరిగిపోయి, నలిగిపోయి, పాతగా ఉండకూడదు. మూడు రంగులు, అశోక చక్రం తప్ప మరే రంగులు, రాతలు ఉండకూడదు.
కాషాయ రంగు పైకి, ఆకుపచ్చ రంగు దిగువన ఉండాలి. నిలువుగా ప్రదర్శించే సమయంలో కాషా యం రంగు ఎడమ వైపున ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరగబడిన జెండాను ఎగురవేయకూడదు.
జెండా వందన సమయంలో త్రివర్ణ పతాకానికి సరిసమానంగా లేదా దానికన్నా ఎత్తులో మరే ఇతర జెండాలు ఉండకుండా చూసుకోవాలి. జాతీయ జెండాను నేల మీద జారవిడవకూడదు. వివిధ అలంకరణ సామగ్రిగానూ జాతీయ జెండాను ఉపయోగించకూడదు.
జెండాపై ఎలాంటి అలంకరణలు, పూలు పెట్టకూడదు. వస్తువులపై, భవనాలపై జెండాను కప్పకూడదు. దుస్తులుగానూ కుట్టించకూడదు. పబ్లిక్ మీటింగుల్లో, సమావేశాల్లో స్టేజ్ పైన కుడి వైపున మాత్రమే (ప్రేక్షకులకు ఎడమ వైపుగా) జెండాను నిలపాలి.
జాతీయ జెండా ఉపయోగించే సమయంలో ఫ్లాగ్ కోడ్ 2002 నిబంధనలను పాటించాలి. జెండాను ఉపయోగించే విధానంలో ఫ్లాగ్ కోడ్‌ను ఉల్లంఘించనట్లైతే చట్ట ప్రకారం శిక్షలు, జరిమానాలను విధిస్తారు. నిబంధనలకు వ్యతిరేకంగా జాతీయ జెండాను అవమానపరిచినా, అగౌరవపరిచినా మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.