ఈ నత్తలు చాలా డేంజర్.. వీటిని తాకొద్దు.. తినొద్దు..!

Update: 2022-07-31 01:30 GMT
ఎవరైనా నెమ్మదిగా నడిస్తే ఏం నత్త నడక నడుస్తున్నావు అంటారు. నెమ్మదత్వం ఉన్నవారిని ఎక్కువగా నత్తతో పోలుస్తుంటారు. వారి వల్ల ఎవరికీ హాని జరగదు. అందుకే వారిని నత్తలతో పోలుస్తుంటారు. కానీ కొన్ని నత్తలు మాత్రం అత్యంత హానికరమైనవి.

ముఖ్యంగా ఆఫ్రికా నత్తలు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నత్తలని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు. వీటి గురించి ఫ్లోరిడా వ్యవసాయ కమిషనర్ నిక్కీ ఫ్రైడ్ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

ఈ నత్తలు లంగ్ వార్మ్స్ (మెనిన్ జైటిస్) అనే పరాన్న జీవులను తమతో పాటు తీసుకుని వస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని తెలిపారు.

ఈ నత్తలు కనీసం 500 రకాల మొక్కలను తినేస్తాయి. దీంతో ఇవి సహజ, వ్యవసాయ ప్రాంతాలకు తీవ్రమైన ముప్పుగా పొంచి ఉన్నాయని నిక్కీ ఫ్రైడ్ వెల్లడించారు. ఈ భారీ ఆఫ్రికన్ నత్తలు 8 అంగుళాల పొడవు వరకు పెరగొచ్చు.

వీటి పునరుత్పత్తి కూడా చాలా వేగంగా జరుగుతుందని చెప్పారు. ఒక భారీ ఆఫ్రికన్ నత్త ఏడాదికి 2000 గుడ్లను పెట్టగలదని ఫ్లోరిడా వ్యవసాయ శాఖకు చెందిన బైయాలజిస్ట్ జ్యాసన్ స్టాన్లీ తెలిపారు.

ఈ నత్తల వల్ల మనుషులకు కూడా ముప్పు పొంచి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని మనుషులు తాకినప్పుడు వీటిలో ఉండే ర్యాట్ లంగ్ వార్మ్స్  మనిషికి అంటుకున్నప్పుడు అవి మెదడులోని నాళాల్లోకి చేరి మెనిన్జైటిస్ అనే వ్యాధికి దారి తీస్తుందని తెలిపారు.
Tags:    

Similar News