వీరుండేది బెంగళూరులో.. కానీ చేసేది ఏపీలో ఎమ్మెల్యే ఉద్యోగం.. వ్యాపార వాణిజ్యాల్లో ఆరితేరిన వ్యాపారవేత్తలు నేతలుగా ఎలా రాణిస్తారు? బెంగళూరులో వ్యాపారం చేసే వారు వైసీపీ గాలిలో గెలిచారు. మరి సుబ్బరంగా ప్రజాసేవ చేయకుండా వ్యాపార కోణంలోనే ఆలోచిస్తూ నియోజకవర్గాన్ని పెడచెవిన పెడుతున్న తీరు విమర్శలకు దారితీస్తోంది.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే వెంకట డౌడ, కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్.. వీళ్లు ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు బెంగళూరులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. అదే విధంగా ముగ్గురు కూడా భవన నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ముగ్గురు కూడా మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలవడం విశేషం. కానీ వీళ్ల చేష్టలే వైసీపీని ఇబ్బంది పెడుతున్నాయి అని క్షేత్రస్థాయి వైసీపీ వర్గాలు అంటున్నాయి.
తాజాగా ఎమ్మెల్యేతో ప్రారంభం కావాల్సిన ఒక బ్రిడ్జి ఒక ప్రైవేట్ వ్యక్తితో కావడం సంచలనమైంది. ఒక ప్రైవేట్ వ్యక్తి బ్రిడ్జిని అట్టహాసంగా ప్రారంభిస్తే అభాసుపాలయ్యాడు పలమనేరు ఎమ్మెల్యే. ఈ చర్య నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయ్యింది. ఇక శ్రీకాళహస్తి మధుసూదన్ రెడ్డి ఏకంగా ట్రాక్టర్ ర్యాలీ పెట్టిన తర్వాత కొంత మంది అధికారులకు కరోనా వచ్చింది. కరోనా రాకతో ఇప్పుడు శ్రీకాళహస్తి కరోనాకు హాట్ స్పాట్ గా మారింది.. అక్కడ రెడ్ జోన్ పెట్టడం జరిగిపోయింది. దీనికి అంతటికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నిర్లక్ష్యమే కారణమన్నా ఆరోపణలు వెల్లువెత్తాయి.
అలానే కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ ఏకంగా బెంగళూరు నుంచి 6 వాహనాల్లో మందితో వస్తే వాళ్లను అక్కున చేర్చుకున్నారట.. ఇది పెద్ద ఎత్తున మీడియాలో చర్చ జరిగింది. ఆ తరువాత ఎమ్మెల్యే ఖండించారు. ఇటీవల కనిగిరిలో బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలింది. అక్కడ టీడీపీ వాళ్లు రచ్చ చేశారు. ఎమ్మెల్యేనే కరోనాను బెంగళూరు నుంచి తీసుకువచ్చాడని టీడీపీ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. అది వైసీపీ అధిష్టాన్ని ఇరుకునపెట్టింది.
ఇలా బెంగళూరుతో కాంటాక్టు ఎమ్మెల్యేల వ్యవహారశైలితో వైసీపీ అధిష్టానానికి తలబొప్పి కడుతోంది. కొత్తగా ఎన్నికైనా ఎమ్మెల్యేలకు కొంచెం సూచన చేసైనా వారిని పాటించేలా అధిష్టానం చర్యలు తీసుకోవాలని వైసీపీ వర్గాలు కోరుతున్నాయి.