దేశంలో ‘లవ్ జిహాద్’ పేరుతో రణరంగం ఏ స్థాయిలో కొనసాగిందో తెలిసిందే. హిందూ అమ్మాయిలను ముస్లింలు ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని మతాలు మారుస్తున్నారని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఇదే విషయమై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసగించే హిందూ అబ్బాలను సైతం లవ్ జిహాద్ గానే పరిగణిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ పరిస్థితిని కట్టడి చేసేందుకు ప్రత్యేక చట్టం చేయబోతున్నట్టు చెప్పారు. మహిళలను హిందువులు, ముస్లింలు ఎవరు మోసగించినా.. తమ ప్రభుత్వం అంగీకరించదని అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్చించి, చట్టం చేస్తుందన్నారు. అదేవిధంగా.. జనాభా నియంత్రణ, పశువుల సంరక్షణ వంటి అంశాలను చట్టం కిందకు తేవాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
ఇక, హిందూత్వం గురించి కూడా ముఖ్యమంత్రి మాట్లాడడం గమనార్హం. అదొక జీవన విధానమని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ముస్లిం, క్రైస్తవంతోపాటు చాలా మతాలు కూడా హిందూత్వం నుంచే వచ్చాయని అన్నారు. వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూత్వను ఆపడం ఎవ్వరి వల్లా కాదని అన్నారు.