ఎన్నికల్లో గెలవటానికి డబ్బులు పంపిణీ చేస్తు సాక్ష్యాలతో సహా దొరికిపోయిన ఓ ఎంపిని జరిమానా వేసి వదిలేయటమేనా ? ఇంకేమీ చేయలేరా ? ఇపుడిదే ప్రశ్న జనాల్లో పెరిగిపోతోంది. ఎన్నికలంటేనే డబ్బు ప్రవాహమన్న విషయం అందరికీ తెలిసిందే. ఎంపి, ఎంఎల్ఏల స్ధానాల్లో ఎవరెంత ఖర్చులు పెట్టాలనే విషయంలో కేంద్ర ఎన్నికల కమీషన్ స్పష్టమైన నిబంధనలు జారీచేసింది. అయితే ఆ ఖర్చులన్నీ పుస్తకాల్లో చదువుకోవటానికి, రాసుకోవటానికే పనికొస్తుంది.
నిబంధనల్లో ఉండే ఖర్చులకు వాస్తవంగా క్షేత్రస్ధాయిలో జరిగే ఖర్చులకు కొన్ని వందల రెట్ల వ్యత్యాసముంటుంది. ఈ విషయం అందరికీ తెలిసినా అదో హిపొక్రసీలాగ కంటిన్యు అవుతోందంతే. ఓట్లకు డబ్బులు ఇవ్వకూడదనేది ఎన్నికల కమీషన్ ప్రధాన నిబంధన. ప్రజలు తమంతట తాముగానే పోలింగ్ బూత్ లకు వచ్చి స్వచ్చందంగా ఓట్లు వేయాలి. అయితే పోలింగ్ సమయంలో జరిగేది భిన్నమని ఎన్నికల కమీషన్ తో పాటు అందరికీ తెలుసు.
అయితే ప్రస్తుత విషయానికి వస్తే తెలంగాణాలోని 2019 మహబూబాబాద్ ఎంపిగా మాలోతు కవిత పోటీచేశారు. ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంచుతు దొరికిపోయారు. దాంతో మాలోతు కవిత మీద నాంపల్లి కోర్టులో కేసు వేశారు. ఇంతకాలం కేసును విచారించిన కోర్టు సాక్ష్యాలను చూసిన తర్వాత గెలుపుకోసం కవిత డబ్బులు పంచారని నిర్ధారణకు వచ్చింది. దాంతో ఎంపికి ఆరుమాసాల జైలుశిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా కూడా విధించింది.
జరిమానాను చెల్లించేసిన ఎంపి అరెస్టు కాకుండా వెంటనే బెయిల్ తెచ్చుకున్నారు. ఇక్కడే జనాలందరికీ సందేహాలు పెరిగిపోతున్నాయి. అవేమిటంటే ఎన్నికల కమీషన్ నిబంధనలను తుంగలో తొక్కిన కవిత ఎంపి పదవిని ఎందుకు ఊడగొట్టలేదని. గెలుపుకోసం డబ్బులు పంచటం నేరమని అందరికీ తెలిసిందే. ఆ నేరం చేస్తు పట్టుబడితే ఎంపి పదవిని కోల్పోవాలి కదానే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
డబ్బులు పంచకుండా ఏ అభ్యర్ధి కూడా ఎన్నికల ప్రకియను పూర్తిచేయలేరు. కానీ చేసే పంపిణీ ఏదో గుట్టుచప్పుడు కాకుండా చేసుకుంటారు. మరీ కవిత లాగ బహిరంగంగా డబ్బులు పంచుతు దొరికపోరు. మరి డబ్బులు పంచుతు దొరకిపోవటమే కాకుండా కోర్టులో నిర్ధారణైన తర్వాత కూడా 10 వేల ఫైన్+ ఆరుమాసాల జైలు శిక్షేనా అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. మరి తాజా కేసు విషయంలో కేంద్ర ఎన్నికల కమీషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.