నెల్లూరులో అమ్మవారి తాళిబొట్టు అదృశ్యం!

Update: 2020-12-19 15:30 GMT
నెల్లూరు జిల్లాలో దొంగలు రోజురోజుకి మరింతగా రెచ్చిపోతున్నారు. గతంలో మహిళల మెడల్లో ఉన్న బంగారాన్ని దోపిడీ చేసేవారు. అలాగే ఖాళీగా ఉన్న ఇళ్లల్లో కూడా దొంగతనాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆలయాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఏకంగా అమ్మవారి మెడలోని తాళిబొట్టు అపహరించడం కలకలం రేపుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఒకే రోజు మూడు దేవాలయాల్లో దొంగతనానికి పాల్పడ్డారు.

దేవాలయాల్లో ఉండే హుండీలోని నగదుతోపాటు అమ్మవారి మెడలోని తాళి బొట్టు కూడా దోచుకెళ్లిపోయారు. ఏఎస్ పేట మండలంలో ఉన్న గుంపర్లపాడు గ్రామంలో ఈ ఘటన జరిగింది. రాత్రివేళ గుర్తుతెలియని కొందరు దుండగులు మూడు ఆలయాలలో చోరీకి పాల్పడ్డారు. వేంకటేశ్వర స్వామి, వినాయకుడి గుడిలోని హుండీలు, రామాలయంలో అమ్మవారి తాళిబొట్టును దొంగలు ఎత్తుకెళ్లడం ఇప్పుడు కల కలంగా మారింది. అయితే ఇది తెలిసిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News