పీపీఈ కిట్స్ తో బంగారం దోపిడీ

Update: 2020-07-07 13:30 GMT
పాత ఒక రోత.. కొత్త ఒక వింత.. పీపీఈ కిట్స్ తో కరోనా రోగులను కాపాడడమే కాదు.. ఏకంగా వాటితో మన ముక్కు మోహం కనపడదు కనుక దొంగతనాలు చేయొచ్చని ఈ దొంగలు నిరూపించారు.

ఒక ఐడియా ఈ దొంగల జీవితాలనే మార్చేసింది. సీసీటీవీలకు దొరక్కుండా.. ఆధారాలు చిక్కకుండా ఈ కరోనా టైంలో ఆ వైరస్ బారిన పడకుండా ఈ దొంగలు వినూత్నంగా ఆలోచించారు. పీపీఈ కిట్స్ వేసుకొని ఏకంగా జువెల్లరీ షాపులో దోపిడీకి పాల్పడ్డారు.

మహారాష్ట్రలోని సతారా జిల్లాలో పీపీఈ కిట్లు ధరించిన దొంగలు ఓ బంగారం దుకాణం షాపులో చొరబడి 780 గ్రాముల బంగారాన్ని దోచుకుపోయారు.సీసీటీవీ చూసిన యజమానులు, పోలీసులు ఖంగుతిన్నారు.

దొంగలు తలలకు క్యాపులు, ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌవ్స్.. పీపీఈ కిట్స్ వేసుకొని పకడ్బందీగా షాపులోకి ప్రవేశించి బంగారు నగలను దోచుకున్నారు. షాపు గోడను పగులకొట్టి మొత్తం 78 తులాల బంగారం దోపిడీ చేశారని బంగారం షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ కరోనా కాలంలో దొంగల తెలివితేటలు చూసి పోలీసులే షాక్ అయ్యారు. సీసీటీవీలో చిక్కకుండా.. వేలిముద్రలు చిక్కకుండా.. కరోనా వ్యాపించకుండా భలే ఐడియా వేశారని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Tags:    

Similar News