కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచం మొత్తం వణికిపోతోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారి దెబ్బకి గజగజ వణికిపోతోంది. ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదు అయ్యాయి. ఈ మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ కోసం అహర్నిశలు ఎన్నో దేశాల నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక ఈ పరిస్థితుల్లో పేస్ మాస్క్ , శానిటైజర్ , గ్లోవ్స్ మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయాయి. ముఖ్యంగ ఆసుపత్రిలో పనిచేసే వైద్య సిబ్బందికి వీటి అవసరం చాలా ఉంది. కరోనా సోకిన పేషేంట్స్ కి ట్రీట్మెంట్ చేసే సమయంలో వీటి ఉపయోగం చాలా ముఖ్యమైంది.
ఇదిలా ఉంటే .. ఆసుపత్రుల కోసం ఉంచిన 60 లక్షల గ్లోవ్స్‌ని దొంగలు దోచేశారు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. కోరల్ స్ప్పింగ్స్ లోని మెడ్గ్‌లవ్ అనే ఓ సప్లయర్ సంస్థ శుక్రవారం రాత్రి మిలియన్ డాలర్లు విలువ చేసే గ్లోవ్స్ ని అందుకుంది. అయితే ఆదివారం రాత్రి కొన్ని నిమిషాల వ్యవధిలో ఆ కంటైనర్ ని కొందరు దొంగలు ఎత్తుకెళ్ళి పోయారు. ఈ ఘటన మొత్తం అక్కడి కెమెరాల్లో రికార్డు అయ్యింది. దీనిపై మెడ్గ్ లవ్ వైస్ ప్రెసిడెంట్ రిక్ గ్రిమ్స్ మాట్లాడుతూ ఫ్లోరిడాలోని పలు ఆసుపత్రులకు గ్లోవ్స్ అవసరం ఇప్పుడు చాలా ఉందని అన్నారు. గత వారం రోజులుగా పలు ఆసుపత్రుల వారు ఫోన్ చేసి గ్లోవ్స్ ఎప్పుడూ వస్తాయి? అని అడుగుతూ ఉన్నారని, ఈ దొంగతనం జరగడం చాలా భాదగా ఉందని తెలిపారు.