చేదు నిజం.. కరోనా వైరస్ ఒకటి కాదు.. పది రకాలా?

Update: 2020-04-29 05:30 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు సంబంధించి కొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చాయి. విన్నంతనే ఉలిక్కిపడేలా ఉండే ఈ చేదు నిజాల్లోకి వెళితే అడుగడుగునా షాకులే. ప్రపంచంలో కరోనా మారణహోమం వెనుక అసలు విలన్ ఎవరన్న విషయాన్ని తాజాగా సైంటిస్టులు గుర్తించారు. కొవిడ్ 19కు సంబంధించిన విలక్షణత ఏమంటే.. మనిషి శరీరంలోకి చేరాక.. అది తన రూపును అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మారిపోతుందట. ఇలా మారిపోయిన రకాలు మొత్తంగా పది వరకూ ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

కరోనా వైరస్ కు సంబంధించి మొత్తం పది రకాలు ఉంటే.. వీటిల్లో వూహాన్ లో కనిపించిన వైరస్ ఓ రకమని.. అది కరోనా వైరస్ లలో పెద్దన్నలాంటిదని చెబుతున్నారు. దాని తర్వాత దాని స్థాయి కాకున్నా.. దగ్గర దగ్గరగా అంతే డేంజర్ ఉన్న వైరస్ గా ‘‘ఏ2ఏ’’గా చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకునే కరోనా మరణాల్లో వూహాన్ లో కనిపించిన ఓ రకం.. మిగిలిన దేశాల్లో కనిపించిన ఏ2ఏనే ప్రాణాల్ని ఎక్కువగా తీస్తుంటాయట.

కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ ప్రపంచంలోని 55 దేశాల్లో 3600 వైరస్ శాంపిళ్లను సేకరించి.. వాటి ఆర్ఎన్ఏ పొందిక మీద పరిశోధనలు చేశారు. ఈ సందర్భంగా వారుకొత్త విషయాల్ని గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ2ఏ వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా 80 శాతం ఉంటే.. భారత్ లో మాత్రం దీని ప్రభాం 45 శాతంగా లెక్క కట్టారు. దేశంలో కరోనా మరణాలకు కారణం ఇదే వైరస్ గా చెబుతున్నారు.

నిజానికి ఏ2ఏ వైరస్సే ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతోన్న విషయాన్ని గుర్తించారు. ఇది ఊపిరితిత్తుల్లోకి చేరి ప్రాణాలు తీస్తున్న వైనాన్ని గుర్తించారు. ఈ రకం వైరస్ శరీరం లోకి ప్రవేశించినంతనే ముందుగా అంటిపెట్టుకొని ఉంటుందని.. ఆ తర్వాత నెమ్మదిగా లోపలకు ప్రవేశించి తన స్థావరాన్ని సుస్థిరం చేసుకుంటుందని గుర్తించారు. శరీరంలో తన పట్టు పెరిగే కొద్దీ తన ప్రభావాన్ని చూపించి.. ప్రాణాల్ని తీయటం దీని అలవాటు.
Tags:    

Similar News