నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ సమర్పించి వాణిజ్య పన్నుల శాఖలో ప్రమోషన్ పొందారనే ఆరోపణలతో టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే కస్టడీలో ఉన్న అశోక్ బాబుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకే అశోక్‌ను చూసేందుకు అవకాశం కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. వాణిజ్య పన్నుల శాఖలో అశోక్ నకిలీ ధ్రువ పత్రంతో ప్రమోషన్ పొందారని ఓ ఉన్నతాధికారి ఫిర్యాదు చేయడంతో గత నెలలో ఆయనపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. గత అర్ధరాత్రి ఆయన్ని అరెస్టు చేసి గుంటూరు ప్రాంతీయ కార్యలయానికి తీసుకొచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా ఆ సీఐడీ కార్యాలయానికి తరలివచ్చారు. అశోక్ బాబు అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి దేవినేని ఉమా నేతృత్వంలో టీడీపీ కార్యకర్తలు గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయనాకి వచ్చారు. అయితే కార్యలయంలోకి ఏ ఒక్కరినీ రానివ్వకుండా పోలీసులు భారీగా మోహరించారు. అశోక్‌బాబును కలిసేందుకు అనుమతించలేదు. దీంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.
బలవంతంగా కార్యాలయంలోకి లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో దేవినేనితో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యాలు చేశారు. గత రాత్రి ఓ పెళ్లిలో తాను, చంద్రబాబు నాయుడు, అశోక్ బాబు ఓ పెళ్లిలో కలిశామన్నారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన అశోక్‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.
గత రాత్రి అశోక్ బాబుపై సీఐడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని సంచలన ఆరోపణలు చేశారు. ఒకవేళ థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదందే అశోక్‌ను మీడియా ముందు హాజరు పరచాలని దేవినేని డిమాండ్ చేశారు. సీఐడీ అధికారులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. గతంలోనూ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సీఐడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వ్యాఖ్యలు వినిపించిన సంగతి తెలిసిందే. తనను తీవ్రంగా కొట్టారని రఘురామ కందిపోయిన తన కాళ్లను చూపించారు. ఈ వ్యవహారం సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది. ఇప్పుడు మరోసారి అశోక్‌బాబు విషయంలో అలాంటి ఆరోపణలే వస్తున్నాయి. మరి బయటకు వచ్చిన తర్వాత అశోక్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.