దేశంలో థర్డ్ వేవ్ విజృంభణ: మరోసారి లాక్డౌన్ తప్పదా..?

Update: 2022-01-07 11:30 GMT
దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. 24 గంటల్లో లక్షకు పైగా కేసులు నమోదు కావడంతో మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త సంవత్సరం నుంచి రోజురోజుకు కేసులు పెరగడమే గానీ తగ్గినట్లు కనిపించలేదు. నిన్నటి వరకు 90 వేలకు చేరిన కరోనా కేసులు 24 గంటల్లో 1,16,836 కేసులు నమోదయ్యాయి. దీంతో థర్డ్ వేవ్ కొనసాగుతున్నట్లేనని వైద్యనిపుణులు అంటున్నారు. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఐఐఎస్సీ-ఐఎస్ఐ నిర్వహించిన సర్వే ప్రకారం ఈ నెలాఖరు వరకు దాదాపు 10 లక్షల కేసులు నమోదు కావడం అని అంచనా వేసింది. దీంతో అవి చెప్పిన విధంగానే కేసులుపెరుగడం ఆందోళన వాతావరణం నెలకొంది.

గతేడాది జూన్ 6న 1,01,209 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత ఏడునెలల తరువాత మళ్లీ ఇదే అధ్యధికంగా నమోదయ్యాయి. దీంతో మరోసారి కరోనా విజృంభిస్తుందని అనుకోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం భారత్లో 3,52,25,699 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు ఒమైక్రాన్ కేసులు కూడా వందల్లో నమోదవుతున్నాయి. గురువారం వరకు ఒమైక్రాన్ కేసుల సంఖ్య 2,630 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే ఒక్కరోజులో 495కు పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనాపై అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలను చేసింది.

దేశ వ్యాప్తంగా మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 36,625 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత పశ్చిమ బెంగాల్ 15,421, ఢిల్లీలో 15,097 కేసులు నమోదయ్యాయి. ఇవి రోజురోజుకు పెరుగుతూ ఈ నెలఖారు వరకు భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే నెలలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కాన్ఫూర్ కు చెందిన ఐఐటీ పరిశోధకులు తెలిపారు. ఇక భారత్ లో థర్డ్ వేవ్ ఫిబ్రవరి రెండు వారాలు ఉండొచ్చని అంటున్నారు. వివిధ రాష్ట్రాల్లో గరిష్టస్థాయి నుంచి ఫిబ్రవరి మధ్యలో మారుతూ ఉంటుందని అంటున్నారు.

ఇక ఒమిక్రాన్ కేసులను పరిశీలిస్తే మహారాష్ట్రలో 797, ఢిల్లీలో 497, రాజస్థాన్ లో 236, కేరళలో 280, కర్ణాటకలో 226 కేసులు నమోదయ్యాయి. దీంతో ఒమిక్రాన్ కేసులు కూడి విపరీతంగా పెరుగుతున్నట్లు అర్థమవుతోంది. ఈనెలాఖరు వరకు ఒమిక్రాన్ కేసులు రోజుకు 10 లక్షలునమోదు కావచ్చని అంటున్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో అనుమానంగా ఉన్నవాటిని ఒమిక్రాన్ ను గుర్తించేందుకు పంపిస్తున్నారు. దీంతో మరిన్ని ఒమిక్రాన్ కేసులు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ఇదిలా ఉండగా అనూహ్యంగా కరోనా కేసులు భారీగా పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది. దీంతో ఆయా రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. తమిళనాడు, పంజాబ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, బీహార్ రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హోం ఐసోలేషన్లో ఉన్నవారిపై జిల్లా యంత్రాంగం పర్యవేక్షణపైనా సూచనలు చేసింది. పరీక్షా కేంద్రాలతో పాటు అంబులెన్స్ లు సిద్ధంగా ఉంచాలని తెలిపింది. కంట్రోల్ రూముల్లో అవసరమైన సిబ్బందిని నియమించాలని తెలిపింది.

గుజరాత్లో అత్యధికంగా 204 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, ఒడిశాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఏపీలో కొత్తగా 547 కేసులు నమోదయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమమై పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కేసుల పెరుగుదలతో పాటు మరణాలు కూడా నమోదు కావడంతో ఆంక్షలు కఠినం చేయాలని సూచిస్తున్నారు. అయితే కేసులు ఇలాగే పెరిగితే మరోసారి లాక్డౌన్ తప్పదా...? అనే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది.


Tags:    

Similar News