కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇతర దేశాలలో అల్లకల్లోలం సృష్టిస్తుంది. బ్రిటన్, అమెరికా లాంటి దేశాలలో ఈ వైరస్ కేసులు లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఇప్పటికే డెల్టా వేరియంట్ కారణంగా మారణహోమం చూసినటువంటి చాలా దేశాలు ఈ వైరస్ ప్రభావం ఎలా ఉంటుందో అని అందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలోనే మన దేశంలో ఒమిక్రాన్ ప్రభావం ఎంత వరకు ఉంటుంది అనే దానిపై ఐఐటీ కాన్పూర్ కు చెందిన కొందరు పరిశోధకులు రీసర్చ్ జరిపారు. మన దేశంలో ఈ వేరియంట్ సృష్టించబోయే అల్లకల్లోలం గురించి స్టడీ చేశారు. దీనిలో ప్రధానంగా తెలిసిన విషయం ఏమిటంటే వచ్చే రెండు నెలల్లో భారతదేశంలో కేసుల సంఖ్య ఎన్నడూ లేనంతగా పెరుగుతుందని తేలింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు స్పష్టం చేశారు. వ్యాప్తి కొన్ని రెట్లు పెరుగుతుందని చెప్పారు. ఈ మేరకు ఓ నివేదికను ప్రచురించారు.
ఇప్పటికే అమెరికా లాంటి దేశాల్లో కేవలం ఒక్క రోజులోనే రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 79 శాతం మేరకు ఒమిక్రాన్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇదే ట్రెండ్ బ్రిటన్ లో కూడా కొనసాగుతుంది. ఒమిక్రాన్ కేసుల కొన్నిరోజుల వ్యవధిలోనే భారీగా పెరిగాయి. మూడింతల పెరిగి పదివేల మార్కును చేరుకున్నాయి. ఈ దేశాల్లో బూస్టర్ డోసు తీసుకున్నా కానీ కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. ఈ నేపథ్యంలోనే భారత్ లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే దానిపై ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు రీసెర్చ్ చేశారు ఇందులో భాగంగా వారు కీలక విషయాలను వెల్లడించారు.
మొదటి దశ రెండో దశలో కూడా కరోనా వైరస్ తొలి కేసు నమోదైన దగ్గరనుంచి 700 రోజులకు పైబడిన తరువాత కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కేసులు అమాంతం గా పెరుగుతాయనే విషయాన్ని ముందుగా కాన్పూర్ పరిశోధకులు పేర్కొన్నారు. ఈ విధంగా చూస్తే భారత్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి కేసుల సంఖ్య అమాంతంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఈ ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు భారత్లో రెండో దశ వస్తుందని మొదటిగా చెప్పారు. అయితే వీరి అంచనాలను నిజం చేస్తూ డెల్టా వేరియంట్ దేశంలో గరిష్ఠ స్థాయిలో కేసులను నమోదు చేసింది. ఆఖరికి ఆస్పత్రుల్లో బెడ్ లు లేకుండా పోయాయి. అత్యంత కష్ట కాలాన్ని భారత్ రెండో దశలో చవి చూసింది. అయితే ఈసారి కాన్పూర్ పరిశోధకుల అంచనాలు నిజమవుతాయి లేదో అనే విషయం తెలియాలి అంటే వేచి చూడాల్సిందే అని అంటున్నారు నిపుణులు.