దాదాపు మూడున్నర నెలల క్రితం మన దేశంలో నెలకొన్న పరిస్థితులు గుర్తున్నాయా? భారీ ఎత్తున నమోదవుతున్న కేసులతో భారత్ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు అధికారికంగా రిపోర్టు అయితే.. అనధికారికంగా మరెన్నో కేసులు నమోదైన పరిస్థితి. ఇలాంటివేళ.. కనీస వైద్య సాయం కోసం ఆసుపత్రులకు పరుగులు తీసిన సన్నివేశాలు ఇప్పటికి వెంటాడుతూనే వస్తుంటాయి. గడిచిన పోయిన కాలం మిగిల్చిన భయానక అనుభవాలతో పాటు.. వర్తమానంలో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ట్రెండ్ ను చూస్తున్నప్పుడు కరోనా మహమ్మారి కత్తి దూసేందుకు మళ్లీ సిద్ధమవుతున్నట్లుగా సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి.
మూడో వేవ్ ముప్పు ముంచుకొస్తుందన్న వైనం అమెరికా.. ఆస్ట్రేలియా.. బ్రిటన్ లాంటి దేశాల్లో అంతకంతకూ పెరుగుతున్న కేసుల్నిచూస్తేనే ఇట్టే అర్థమవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక్కటే. వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున పూర్తి అయిన దేశాల్లోనే కరోనా భారీగా విరుచుకుపడుతుంటే.. అంతంతమాత్రంగా టీకా కార్యక్రమాన్ని చేపడుతూ.. కరోనా మీద అవగాహన ఉన్నప్పటికి..ఆచరణలో పెద్దగా పట్టనట్లుగా వ్యవహరించే మన వారికి మూడో ముప్పు మరింత తీవ్రంగా ఉంటుందన్నది మర్చిపోకూడదు.
కరోనా వైరస్ సైకిల్ ను చూస్తుంటే.. అమెరికాలాంటి దేశంలో విరుచుకుపడిన నెల వ్యవధిలో మనల్ని కమ్మేయటం.. గడిచిన రెండు వేవ్ ల్లోనూ చూశాం. ఇప్పుడు కేసుల సంఖ్య ఎక్కువ అవుతున్నాయంటే.. మనకు ముప్పు పొంచి ఉన్నట్లే. దీనికి తగ్గట్లే మన దగ్గరపరిస్థితులు ఉన్నాయి. కేరళలో మూడో వేవ్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్ని మిగిలిన రాష్ట్రాల్లో పోల్చలేం.
కేసుల నమోదు అంతకంతకూ తగ్గిపోతున్న నేపథ్యంలో.. ఈ మధ్యన ప్రజలు యథావిధిగా బయటకు వస్తున్నారు. రోడ్లు మళ్లీ కళకళలాడుతున్నాయి. పలుచోట్ల గతంలో మాదిరే ట్రాఫిక్ జాంలు చోటు చేసుకుంటున్నాయి. మాల్స్ కిక్కిరిసిపోతున్నాయి. శుభకార్యాలు.. వేడుకలు ఎవరికి వారు వారి స్థాయిల్లో జాగ్రత్తలు తీసుకుంటూనే నిర్వహిస్తున్నారు. ఇన్ని చేస్తున్నా.. కరోనా వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని చాలామంది ఏ మాత్రం పట్టటం లేదు. ముక్కును కవర్ చేయాల్సిన మాస్కు.. కిందకు ఉంటుందే తప్పించి.. సరైన ప్లేస్ లో ఉండటం లేదు. భౌతిక దూరం అన్న మాట అక్కడా ఇక్కాడా అన్న తేడా లేకుండా ఎక్కడా ఉండట్లేదు.
శానిటైజేషన్ విషయంలో పెద్దగా పట్టింపులు ఉండటం లేదు. ముక్కుకు మాస్కులు పెట్టుకోవటం మినహా.. మరే ఇతర జాగ్రత్తల విషయంలో అంత సీరియస్ నెస్ కనిపించని పరిస్థితి. ఇలాంటివేళ.. మూడో వేవ్ కు మరో అవకాశం ఉంటుందని చెప్పాలి. ఇప్పటి వరకు వినిపిస్తున్న అంచనాలు.. అమెరికా.. ఆస్ట్రేలియాలో భారీగా నమోదవుతున్న కేసుల్ని చూస్తుంటే.. మరో నెలలో మన దగ్గర కేసుల తీవ్రత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పాలి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవటం.. మూడో వేవ్ ముప్పును అంతో ఇంతో తగ్గిస్తుందని చెప్పక తప్పదు. సో..సెప్టెంబరును ఎంత సీరియస్ గా తీసుకుంటే అంత మంచిదన్న విషయాన్ని మర్చిపోకూడదు. బీకేర్ ఫుల్.