మనదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. అయితే, ఇది ముగియక ముందే, మూడో వేవ్ వస్తోందని, అది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపబోతోందన్న వార్తలు అందరిని ఆందోళనకి గురిచేస్తున్నాయి. అయితే దీనిపై మరింత స్పష్టతనిచ్చారు. కరోనా టాస్క్ ఫోర్స్ చీఫ్ వీకే పాల్. థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పాల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడారు, ప్రత్యేకం గాపై పిల్లలపైనే ప్రభావం చూపే వేవ్ ఉంటుందన్న దానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదన్నారు.
ఇప్పటి వరకూ కరోనా అందరిపై ఒకే రకమైన ప్రభావం చూపిందని వీకే పాల్ తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన సెరోప్రివలెన్స్ డేటా ఇదే స్పష్టం చేస్తోందన్నారు. వ్యక్తుల బ్లడ్ సీరంలో ఉండే వ్యాధి కారకాల స్థాయిని తెలిపేదే ఈ సెరోప్రివలెన్స్. ఇది పెద్దలు, పిల్లల్లో ఒకేలా ఉన్నట్లు వీకే పాల్ వెల్లడించారు. తల్లిదండ్రులు వ్యాక్సిన్లు తీసుకుంటే చాలు దాని వల్ల పిల్లలకు రక్షణ కలుగుతుందని వీకే పాల్ అన్నారు. ఇంట్లోని పెద్దలు వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల వైరస్ పిల్లల వరకూ వైరస్ రావడం అంత సులువు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, థర్డ్ వేవ్ అనేది ప్రత్యేకంగా పిల్లలపైనే ప్రభావం చూపుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, ఎవరూ ఆందోళన గురికావాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ చీఫ్ రణ్ దీప్ గులేరియా కూడా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కూడా తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ వార్తలకు శాస్త్రీయ ఆధారాలు అంటూ ఏవీ లేవని ఐఏపీ స్పష్టంచేసింది. అయితే, ఒకవేళ పిల్లలకు కరోనా సోకినా చాలా వరకు లక్షణాలు ఉండబోవని, ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే పిల్లలకు వైరస్ సోకకుండా ముందే అన్ని జాగ్రత్తలూ తీసుకుంటే మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.