హనుమంతుడి జన్మస్థలం తిరుమలే?

Update: 2021-04-09 15:30 GMT
హనుమంతుడి జన్మస్థలంపై కొద్దిరోజులుగా జరుగుతున్న వివాదంపై ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చేసింది. ఆ చిరంజీవుడి జన్మస్థలం తిరుమలే అని టీటీడీ నియమించిన కమిటీ నిర్ధారించింది. ఆకాశగంగ తీర్థం హనుమంతుడి జన్మస్థలంగా నిర్ధారించింది.పూజా విధానాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇలా మూడు చారిత్రక ఆధారాలతో హనుమంతుడి జన్మస్థానంపై నిర్ణయం తీసుకున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

ఇక స్కంధ పురాణం, వరాహ పురాణం, పద్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, వేంకటాచల మహత్యం వంటి పురాణాలలో ఉన్న ఆధారాలు సేకరించిన కమిటీ ఇస్రో శాస్త్రవేత్తల సహకారంతో శాస్త్రీయ ఆధారాలు కూడా టీటీడీ కమిటీ సేకరించినట్టు తెలిసింది.

అన్నమాచార్య 7వ కీర్తనలోనూ హనుమంతుడి జన్మస్థలం గురించి ప్రస్తావన ఉన్నట్లు కమిటీ పేర్కొంది. విభిషణ శర్మ నేతృత్వంలోని మురళీధర శర్మ , సుదర్శన్ శర్మ, రామకృష్ణ , శంకరనారాయణలతో కూడిన కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా ఉగాది రోజున అధికారికంగా ఇది ప్రకటించనున్నట్టు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు.
Tags:    

Similar News