హ‌న్మంతుడు మీవాడు కాదు.. మావాడు! ప్ర‌క‌టించిన పొరుగు రాష్ట్రం!

Update: 2021-04-24 09:30 GMT
ఆంజ‌నేయుడి జన్మస్థలంపై వివాదం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. హనుమంతుడు ఏపీకి చెందిన వాడని టీటీడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తిరుమల ఏడు కొండల్లోని అంజనాద్రి హనుమంతుడి జన్మస్థానమని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. అంజనాద్రిలోని జాపాలీ తీర్థంలో పుట్టాడని ప్రకటించింది. అయితే.. దీన్ని కర్నాటక తోసిపుచ్చింది. మారుతి తమ ప్రాంతానికి చెందిన వాడని ప్రకటించింది. దీనికి ఎన్నో ఆధారాలు ఉన్నాయ‌ని తెలిపింది.

క‌ర్నాక‌ట రాష్ట్రంలోని హంపి స‌మీపంలో ఉన్న ఆంజ‌నేయాద్రి కొండ హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌ల‌మ‌ని క‌ర్నాట‌క స‌ర్కారు ప్ర‌క‌టించింది. ఈ విష‌యం రామాయ‌ణంలోనూ స్ప‌ష్టంగా ఉంద‌ని చెప్పింది. త్వ‌ర‌లోనే ఏఎస్ఐ స‌ర్వే నిర్వ‌హించి, నిరూపిస్తామ‌ని మంత్రి ఈశ్వ‌ర‌ప్ప చెప్పారు.రామ‌ల‌క్ష్మ‌ణులు ఆంజ‌నేయాద్రిపైనే హ‌నుమంతుడిని క‌లిసిన‌ట్టు పురాణాల్లో ఉంద‌ని మ‌రో మంత్రి శ్రీనివాస పూజారి అన్నారు. హ‌నుమంతుడు ఏపీలో జ‌న్మించాడ‌ని టీటీడీ ఏ ఆధారాల‌తో ప్ర‌క‌టించిందో త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పారు.

అయితే.. ఈ విషయంలో ఏపీ ప్ర‌భుత్వంతో త‌మ‌కు వివాదం ఏమీ లేద‌ని, స‌ర్వే చేయించి హ‌నుమంతుడు త‌మ ప్రాంతం వాడేన‌ని నిరూపిస్తామ‌ని చెప్పారు. దీంతో.. ఎన్నో ఏళ్లుగా న‌లుగుతున్న హ‌న్మంతుడి జ‌న్మ‌స్థానం వివాదం.. మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చిన‌ట్టైంది. అయోధ్య‌లో రామాల‌యం నిర్మాణం జ‌రుగుతుండ‌డంతో.. హ‌నుమంతుడి జ‌న్మ‌స్థానం తేల్చి, ఆయ‌న‌కు గుడి క‌ట్టాల‌నే డిమాండ్లు మొద‌ల‌య్యాయి.
Tags:    

Similar News