తెలంగాణ ఎన్నికలు ఖరీదు అయిపోయాయి. ఇక్కడ పోటీచేయాలనుకుంటే మంచి పేరు - ప్రఖ్యాతలు మాత్రమే కాదు.. కావాల్సినంత డబ్బుండాలి. వేలు, లక్షలు కాదు.. కోట్లు.. అవును.. ఆర్థికంగా లేకపోతే తెలంగాణ ఎన్నికల బరిలో గెలవడం కష్టమేనట.. కనీసం ఒక అభ్యర్థి రూ.4 నుంచి 5 కోట్లు పెట్టే స్థోమత ఉంటేనే పోటీకి సిద్ధంగా ఉండాలని అధిష్టానాలు ముందే సూచించాయట.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సాధారణ అసెంబ్లీ సీట్లకే ఈ రేటు.. మరి ఖరీదైన సీట్లకు ఎంతనుకుంటున్నారు..? తెలిస్తే నోరెళ్ల బెడతారు..
తెలంగాణలో అత్యంత ఖరీదైనా 15 నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ డబ్బు నీళ్లలాగా ఖర్చు చేస్తుంటారు పోటీచేసే అభ్యర్థులు.. అన్ని పార్టీల నుంచి ఈ నియోజకవర్గాల్లో బిగ్ షాట్సే పోటీచేస్తున్నారు. చాలా పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నారు.. ఒక్కో ఓటుకు తెలంగాణ వ్యాప్తంగా సగటున రూ.1000 ఇస్తే.. ఈ 15 నియోజకవర్గాల్లో మాత్రం ఓటుకు రూ.2000 చొప్పున పంచుతారట..
తెలంగాణలోనే అత్యంత భారీ వ్యయం కలిగే సీట్లు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఎల్ బీనగర్ - రాజేంద్రనగర్ - శేర్ లింగంపల్లిలు.. ఈ మూడు నియోజకవర్గాలు తెలంగాణలోనే బహు ఖరీదైనవట.. ఆ తర్వాత వరుసగా చూస్తే షాద్ నగర్ - సిరిసిల్ల - మంచిర్యాల - కోదాడ - కొడంగల్ - మహబూబాబాద్ - హుజూర్ నగర్ - సూర్యపేట. వరంగల్ ఈస్ట్ - వెస్ట్ లు ఖరీదైన నియోజకవర్గాలుగా ఉన్నాయి.
ఇందులో చూస్తే సిరిసిల్ల నుంచి కేటీఆర్ పోటీచేస్తున్నారు. హూజూర్ నగర్ - కోదాడ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ - ఆయన భార్య పద్మావతి పోటీపడుతున్నారు. కోడంగల్ నుంచి రేవంత్ రెడ్డి - సూర్యపేట నుంచి మంత్రి జగదీశ్వర్ రెడ్డి బరిలో నిలుస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. చాలా నిర్మాణాలు జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ లోని కొంత భాగం ఇక్కడి అభ్య్థర్థులకు వాటాగా వెళుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ నియోజకవర్గాల్లో డబ్బు ఏరులై పారుతుందని చెబుతుంటారు.