మారుతున్న కాలానికి.. అభిరుచికి తగ్గట్లు సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి కంపెనీలు. ఇప్పుడు చెప్పే విషయం ఆ కోవకు చెందినదే. ఒక కారును.. తమ మూడ్ కు అనుగుణంగా రంగును మార్చేసుకునే అవకాశం ఉంటే? ఆలోచనే అదిరింది కదూ. కానీ.. ప్రఖ్యాత కార్ల కంపెనీ.. ఈ బీఎండబ్ల్యూ ఈ అదిరే ఐడియాను వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేసింది. జన్మనీకి చెందిన ఈ సంస్థ తాజాగా ఐఎక్స్ ఫ్లో పేరుతో రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ కారు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
లాస్ వెగాస్ లో జరుగుతున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2022లో ఈ సరికొత్త కారును ఆవిష్కరించింది. ఒక్క బటన్ నొక్కితే చాలు ఈ కారు రంగు మారిపోవటం దీని ప్రత్యేకత. ఈ-ఇంక్ కంపెనీ సహకారంతో ఈ సరికొత్త సాంకేతికతను ఈ కారులో వినియోగించారు. కారులోని ఒక బటన్ నొక్కగానే రంగు మారుతుంది. అంటే.. వేసుకున్న దుస్తులకు అనుగుణంగా నడిపే కారు రంగు ఉంటే అన్న ఐడియానే అదిరిపోతుంది. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేసింది బీఎండబ్ల్యూ.
ఈ మోడల్ కు సంబంధించిన వీడియోను తాజాగా ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. ఇలా రంగులు మారే టెక్నాలజీ కారణంగా ఈ కారులో ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ సామర్త్యం కూడా మెరుగుపడుతుందని కూడా సంస్థ చెబుతోంది. రాబోయే రోజుల్లో బయట రంగే కాదు.. కారు ఇంటీరియర్ రంగును కూడా మార్చే అవకాశం ఉందని చెబుతోంది. ఈ లెక్కన రాబోయే రోజుల్లో ఇలాంటి టెక్నాలజీ సిత్రాలు అందుబాటులోకి ఎన్ని వచ్చేస్తాయో?
Full View