ఇవాల్టి రోజు ఇంకెప్పటికి రాదు.. ఇలాంటి మేజిక్ రిపీట్ కాదు

Update: 2020-10-10 04:30 GMT
కొన్నిరోజులకు ఉండే ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ఆ లెక్కన చూస్తే.. ఇవాల్టి రోజు.. పండుగ కాదు. అలా అని పర్వదినం కాదు. అంతర్జాతీయంగా కానీ జాతీయంగా కానీ.. ప్రాంతీయంగా కానీ ఏ విధమైన ప్రత్యేకత ఉన్నట్లు కనిపించదు. కానీ.. తరచి చూస్తే.. ఈ రోజు తేదీనే సో స్పెషల్. క్యాలెండర్ లో ఈ రోజుకున్న ప్రత్యేకత చూసినప్పుడు.. మళ్లీ ఇలాంటి మేజిక్ ఇంకెప్పటికి రిపీట్ కాదని చెప్పక తప్పదు.

ఇవాల్టి ప్రత్యేకత.. ఈ రోజు తేదీనే. ఇవాళ.. అక్టోబరు 10. అంకెల్లో చూస్తే.. 10-10-2020. వరుసగా రెండు పదులు.. ఆ తర్వాత వరుసగా రెండు ఇరవైలతో ఇవాల్టి రోజు ఉంది. సంఖ్యా పరంగా ఇలాంటి అరుదైన కాంబినేషన్ ఇంకెప్పటికి సాధ్యం కాదనే చెప్పాలి. మామూలుగా అయితే.. ఇవాల్టి రోజును మరింత వినూత్నంగా జరుపుకోవటం.. వేడుకలు చేసుకోవటం లాంటివి ఉండేవి.

మాయదారి కరోనా కారణంగా.. ఇవాల్టి డేట్ కున్న ప్రత్యేకతను మాట్లాడుకోవటం.. మురిసిపోవటం మినహా చేసేది ఏమీ లేని పరిస్థితి. అంతర్జాతీయంగా కరోనా రెండో దశ తీవ్రంగా ఉండటంతో పలు దేశాలు మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతున్నాయి. ఇలాంటివేళ.. డేట్ లోని మేజిక్ ను ప్రత్యేకంగా ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు. మొత్తంగా చూస్తే.. డేట్ పరంగా వచ్చే మేజిక్ ఇంకెప్పటికి రాదు. సో.. ఈ స్పెషల్ డే ను మీకు నచ్చినట్లు.. నచ్చిన వారితో కలిపి జరుపుకోండి. కుదరకుంటే షేర్ చేసుకుంటే సరి.
Tags:    

Similar News