వీడియో స్ట్రీమింగ్ ఓటీటీలు అన్నీ కూడా ఏవీ ఉచితంగా రావు. వాటికి ఎంతో కొంత డబ్బులు చెల్లించాలి. కానీ ఉచితంగా దొరికేది కేవలం 'యూట్యూబ్' మాత్రమే. అందుకే మన సినీ తారలు తమ ఫస్ట్ లుక్ లు, టీజర్ లు అన్ని యూట్యూబ్ లోనే మొదట విడుదల చేస్తారు. ఇది ఉచితం కావడంతో ప్రతీ ఒక్కరూ చూస్తారని ఇలా చేస్తారు. సామాన్య ప్రేక్షకుడికి యూట్యూబ్ ఒక్కటే దిక్కు. ఎలాంటి నిబంధనలు లేకుండా ఉచితంగా ఇందులో పాత సినిమాలు, ఎంటర్ టైన్ మెంట్ వినోదాన్ని చూసే వీలుంది.
ఇక యూట్యూబ్ కూడా రెవెన్యూ మోడల్ లోకి వెళ్లిపోయాక మార్పులు చేసింది. ప్రీమియం తీసుకొచ్చి యాడ్స్ ఫ్రీ అంటూ డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టింది. ఇంతకుముందు స్కిప్ ఆప్షన్ ఉండేది. ఇప్పుడు దాన్ని తీసేశారు. చచ్చినట్టు ఒకటి రెండు ప్రకటనలు చూస్తేనే మనం కోరుకున్న బొమ్మ వస్తుంది.
ఓటీటీలు అలా కాదు.. ఏడాది, నెలకు, ఆరు నెలలకు చొప్పున ప్రీమియం కడితేనే అవి చూసే వీలుంది. చాలా మంది డబ్బులు ఎందుకు దండగా అని ఉచితంగా వచ్చే యూట్యూబ్ తోనే సర్దుకుపోతున్నారు.
ఇక యూట్యూబ్ లో యాడ్స్ తలనొప్పి భరించలేని వాళ్లు వీటిని ఫ్రీ ట్రయల్ వాడి తర్వాత సబ్ స్రైబర్స్ గా మారుతున్నారు. ఈ సంఖ్య పెద్దగా లేదు. యాడ్స్ చూస్తేనే యూట్యూబ్ కంటెంట్ ను ఎంజాయ్ చేసే వారు ఎక్కువగా ఉన్నారు.
తాజాగా యూట్యూబ్ వినియోగదారులందరికీ గట్టి షాక్ ఇచ్చింది. స్కిప్ లేదా ఫార్వర్డ్ చేసే అవకాశం లేని అయిదు యాడ్లు చూశాకే అసలు వీడియో వచ్చేలా సరికొత్త మార్పులు తీసుకురాబోతున్నట్టు తెలిసింది. ఇప్పటికే ప్రయోగాత్మక పరిశఈలన పూర్తయ్యింది. ఇది అమలు చేస్తే ఇక యూట్యూబర్స్ కు కష్టాలే.
ముఖ్యంగా ట్రైలర్లు, టీజర్లు, లిరికల్ వీడియోలు వచ్చినప్పుడు అంత సేపు యాడ్స్ చూస్తు వెయిట్ చేయడమంటే నరకమే.. దానికంటే ఖర్చు అయినా పర్లేదు సొమ్ములు కట్టేద్దాం అనుకునేవాళ్లు ఉంటారు. యూట్యూబ్ ప్లాన్ కూడా అదే.
మెల్లిగా ఉచితంగా అందరినీ అలవాటు చేసిన యూట్యూబ్ ఇప్పుడు డబ్బులు గుంజడానికి రెడీ అయిపోందన్నట్టు. ఇదే జరిగితే ఇక యూట్యూబ్ చూడడానికి కూడా మనం డబ్బులు వెచ్చించాల్సిందే..
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.