‘మద్యపానం.. ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అంటూ నోరు పడిపోయేట్లు ఎంత ప్రచారం చేసినా.. సిగిరెట్ అమ్మకాలు తగ్గవు. మద్యం అమ్మకాలు అసలే పడిపోవు. అంతకంతకూ పెరిగిపోవటం తప్పించి.. ఏ మాత్రం తగ్గని మద్యం అమ్మకాల జోరు చూస్తే.. మన చుట్టూ ఉన్న వారి అలవాట్లు ఎంతలా దారి తప్పుతున్నాయో ఇట్టే అర్థమయ్యే పరిస్థితి. ఆ మాటకు వస్తే.. ఇవాల్టి రోజున తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మద్యం అమ్మకాల కారణంగా వచ్చే పన్నులే.. ఖజానాకు కొండంత అండగా నిలుస్తున్నాయి.
మద్యం సేవించే అలవాటుకు శుభారంభం బీరుతోనే షురూ అవుతుంది. బీరు ఎంతో ఇష్టంగా తాగేసేటోళ్లు.. ఒకసారి కూర్చుంటే.. బాటిళ్ల మీద బాటిళ్లు ఖాళీ చేస్తారు. ఇంత ఇష్టంగా తాగే బీరును మద్యం అలవాటు లేనోళ్లు టచ్ చేస్తే.. నోట్లో పడిన బీర్ ను వెంటనే ఊసేస్తారు. కుంకుడు రసం రుచిలో ఉండే బీర్ ను ఎందుకింతలా ఇష్టపడతారు? సీసాలకు సీసాలు ఎలా ఖాళీ చేస్తారు? అన్న సందేహం కలుగుతుంది.
ఇదే మాటను బీరుకాయల్ని అదే పనిగా లేపేసే వారిని అడిగితే.. చిరునవ్వుతో.. ఆ సీక్రెట్ తెలుసుకోవాలనుకుంటున్నావా? ఇంకెందుకు ఆలస్యం అదే పనిగా బీరు కాయల్ని తాగేసేయ్. నీకు తత్త్వం బోధ పడుతుందంటూ చేసే ఉపదేశానికి ఏ మాత్రం టెంప్టు అయినా.. బీరు మీద ఇష్టం ఎందుకన్న రీసెర్చ్ కాస్తా.. బీరుప్రియుడిగా మారిపోవటం ఖాయం.
అంతలా తనతో కట్టేసుకునే టాలెంట్ బీర్ సొంతం. దీని వినియోగం విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటాపోటీ పడుతుంటాయి. ఏడాదికి ఏడాది పెరగటమే తప్పించి తగ్గటమన్నదే లేని పరిస్థితి. ఎండలు మండే వేళ.. బీరు తాగితే ఉపశమనం అన్న చెత్త వాదనను చాలామంది వినిపిస్తారు. నిజానికి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బీర్ ను లాగిస్తే.. మరింత దాహంగా ఉండటంతో పాటు.. ఆరోగ్యాన్ని దారుణంగా డ్యామేజ్ చేస్తుంది.
చాలామంది బీర్ లో ఆల్కహాల్ శాతం ఏమీ ఉండదని చెబుతారు.కానీ.. 650 ఎంఎల్ లో 5 నుంచి 7.5 శాతం వరకు ఉంటుంది. బ్రాందీ.. విస్కీలతో పోలిస్తే ఇందులో తక్కువ ఉంటుంది. ఆ మాటకు వస్తే వైన్ లోనూ ఆల్కహాల్ శాతం 6 నుంచి 24 వరకు ఉంటుందని చెబుతారు. తెలంగాణలో ఏడాది వ్యవధిలో బీర్ అమ్మకాలు ఎంత భారీగా పెరిగాయో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.
గత ఏడాది తొలి నాలుగు నెలల్లో 1.06 కోట్ల పెట్టల బీరు అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది మొదటి నాలుగు నెలలు (జనవరి - ఏప్రిల్) మధ్యన జరిగిన బీర్ అమ్మకాలు చూస్తే నోట మాట రాదంతే. ఈ నాలుగు నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన బీర్ అమ్మకాలు ఏకంగా 1.49 కోట్ల పెట్టెలు. అంటే.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 45 శాతం ఎక్కువగా బీర్ అమ్మకాలు సాగాయని చెప్పాలి. ఇదెంత ఆందోళకర అంశమన్నది ప్రత్యేకంగా చెప్పాలంటారా?