దేశంలో కరోనా డేంజర్ స్టేజ్ కి చేరిందా? నెక్ట్స్ ఇదే

Update: 2020-08-21 02:30 GMT
దేశంలో కరోనా డేంజర్ స్టేజ్ కి చేరిందా? కల్లోలానికి చేరువైందా? అంటే ఔననే అంటున్నారు నిపుణులు. జనవరి 30న భారత్ లో తొలి కేసు నమోదైంది. మార్చి 21 నుంచి లాక్ డౌన్ పెట్టారు. అప్పటి నుంచి చాపకింద నీరులా కరోనా విస్తరిస్తోంది. దేశమంతా విస్తరించింది.

జూన్ లో రోజుకు 1000 కేసులు దేశంలో నమోదయ్యాయి. కానీ ప్రస్తుతం రోజువారీ మొత్తం కేసులు ఏకంగా రోజుకు 70వేలకు చేరువయ్యాయి. ప్రస్తుతం దేశంలో కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని.. తొందరలోనే భారత్ లో పీక్ స్టేజ్ కు చేరబోతోందని వారు నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశాల్లో కేసుల పరిస్థితి చూసి నిపుణులు అంచనా వేస్తున్నారు.

అయితే 75శాతం రికవరీ రేటు నమోదైన దేశాల్లో కేసుల వ్యాప్తి తగ్గిపోయింది. సౌదీ, మలేషియా, బహ్రెయిన్ వంటి దేశాల్లోనూ ఇలానే తగ్గిపోయింది. ఇప్పుడు భారత్ లోనూ రికవరీ రేటు 71శాతంగా ఉంది. గత వారం రోజుల కేసుల సంఖ్య పరిశీలిస్తే గ్రాఫ్ లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో కేసుల సంఖ్య తగ్గిపోయే అవకాశం కనిపిస్తోందంటున్నారు.
Tags:    

Similar News